టార్గెట్ బీఆర్ఎస్.. 24 స్థానాల్లో ఒకే పేరుతో అభ్యర్థులు
అధికార BRS అభ్యర్థుల పేరుతోనే ఇతర పార్టీల నేతలు, ఇండిపెండెంట్లు ఆయా స్థానాల్లో బరిలో నిలిచారు.
ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడలు, వ్యూహాలు మన ఊహకు కూడా అందవు. గుర్తును పోలిన గుర్తులు, పేర్లను పోలిన పేర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటారు. తాజా ఎన్నికల్లో ఏకంగా 24 స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఒకటే అంటే ప్రత్యర్థుల వ్యూహం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ 24 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే ప్రధానంగా అధికార పార్టీనే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికార BRS అభ్యర్థుల పేరుతోనే ఇతర పార్టీల నేతలు, ఇండిపెండెంట్లు ఆయా స్థానాల్లో బరిలో నిలిచారు.
24 స్థానాల్లో ఒకే పేరుతో అభ్యర్థులు
నిర్మల్:
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(BRS)
మంతెన ఇంద్రకరణ్‌రెడ్డి(ADR)
మహేశ్వరం:
సబితాఇంద్రారెడ్డి (BRS)
మద్ది సబిత (స్వతంత్ర అభ్యర్థి)
ముషీరాబాద్:
ముఠా గోపాల్ (BRS)
ఎం.గోపాల్ (ఏఐహెచ్‌సీపీ)
పరిగి:
కొప్పుల మహేశ్వర్‌రెడ్డి (BRS)
మారెడ్డి మహేశ్‌రెడ్డి (ఏడీఆర్)
సనత్‌నగర్:
తలసాని శ్రీనివాస్ యాదవ్ (BRS)
ఉప్పలపాటి శ్రీనివాస్(యుగ తులసి)
మహబూబ్‌నగర్:
వి.శ్రీనివాస్‌గౌడ్ (BRS)
యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్)
సి.శ్రీనివాస్‌రెడ్డి (స్వతంత్ర అభ్యర్థి)
మునుగోడు:
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (BRS)
కట్టా ప్రభాకర్‌రెడ్డి (ఏడీఆర్)
అందోలు:
చంటి క్రాంతికిరణ్ (BRS)
ఎన్.క్రాంతికుమార్, పి.క్రాంతికుమార్ (స్వతంత్రులు)
జహీరాబాద్:
ఎ.చంద్రశేఖర్ (కాంగ్రెస్)
చంద్రశేఖర్, ఎం.చంద్రశేఖర్, ఎడ్ల చంద్రశేఖర్(స్వతంత్రులు)
ఇబ్రహీంపట్నం:
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (BRS)
కె.కిషన్‌రెడ్డి (ఏడీఆర్)
రాజేంద్రనగర్:
తోకల శ్రీనివాస్‌రెడ్డి (BJP)
కె.శ్రీనివాస్‌రెడ్డి (స్వతంత్ర అభ్యర్థి)
దేవరకద్ర:
ఆల వెంకటేశ్వర్‌రెడ్డి(BRS)
ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి(స్వతంత్ర అభ్యర్థి)
గవిండ్ల మధుసూదన్‌రెడ్డి(కాంగ్రెస్)
బండ్ల మధుసూదన్‌రెడ్డి(ఆర్‌యూపీపీ)
గద్వాల:
సరిత(కాంగ్రెస్)
జి.సరిత(నవరంగ్ కాంగ్రెస్ పార్టీ)
సరిత(స్వతంత్ర అభ్యర్థి)
షాద్‌నగర్:
వై.అంజయ్య(BRS)
అంజయ్య(స్వతంత్ర అభ్యర్థి)
కొల్లాపూర్:
బీరం హర్షవర్ధన్‌రెడ్డి(BRS)
కీసరి హర్షవర్ధన్‌రెడ్డి(స్వతంత్ర అభ్యర్థి)
హుజూర్‌నగర్:
శానంపూడి సైదిరెడ్డి(BRS)
తిమ్మారెడ్డి సైదిరెడ్డి(స్వతంత్ర)
నల్గొండ:
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(కాంగ్రెస్)
గుంటోజు వెంకట్‌రెడ్డి(స్వతంత్ర)
గోషామహల్:
నందకిశోర్ వ్యాస్(BRS)
శుభం వ్యాస్, సందీప్ వ్యాస్(స్వతంత్రులు)
ఆసిఫాబాద్:
అజ్మీరా శ్యామ్‌నాయక్(కాంగ్రెస్)
అజ్మీరా ఆత్మారావు(BJP)
అజ్మీరా రామ్‌నాయక్(స్వతంత్ర)
ఖానాపూర్:
రమేశ్ రాథోడ్(BJP)
రితేశ్ రాథోడ్(స్వతంత్ర)
ముథోల్:
పటేల్ నారాయణరావు(కాంగ్రెస్)
పటేల్ రామారావు(BJP)
ములుగు:
బడే నాగజ్యోతి(BRS)
బడే విద్యాసాగర్(స్వతంత్ర)
భూపాలపల్లి:
గండ్ర వెంకటరమణారెడ్డి(BRS)
గండ్ర సత్యనారాయణరావు(కాంగ్రెస్)
ధర్మపురి:
ఎస్.కుమార్(BJP)
అడ్లూరి లక్ష్మణ్‌కుమార్(కాంగ్రెస్)