Telugu Global
Telangana

చేతికర్ర లేకుండానే అసెంబ్లీకి కేసీఆర్‌

చాలాకాలం తర్వాత, మొదటిసారి చేతికర్ర లేకుండానే కేసీఆర్ బయటకివచ్చారు. ఎలాంటి సపోర్ట్‌ లేకుండానే నడుస్తూ వచ్చి కారు ఎక్కారు.

చేతికర్ర లేకుండానే అసెంబ్లీకి కేసీఆర్‌
X

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి శాసనసభ సమావేశాల్లో పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులు అసెంబ్లీకి వెళ్లలేకపోయారు. కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు రాకపోవడంతో అధికారపార్టీ నేతలు ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఈనేపథ్యంలో వాటన్నింటికీ చెక్‌ పెడుతూ బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొన్నారు.

డిసెంబర్‌ 8న ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జారిపడటంతో కేసీఆర్‌కు తుంటి ఎముకకు గాయమైన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్స అనంతరం.. డాక్టర్ల సూచన మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత చేతికర్రతోనే జనాల్లోకి వచ్చారు. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి చేతికర్రతోనే అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్‌. తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల సమయంలోనే చేతికర్ర సాయంతోనే కేసీఆర్ ప్రచారం చేశారు.

చాలాకాలం తర్వాత, మొదటిసారి చేతికర్ర లేకుండానే కేసీఆర్ బయటకివచ్చారు. ఎలాంటి సపోర్ట్‌ లేకుండానే నడుస్తూ వచ్చి కారు ఎక్కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, మాగంటి గోపినాథ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి కేసీఆర్‌ నందినగర్‌ నివాసానికి వచ్చారు. దగ్గరుండి ఆయన్ని అసెంబ్లీకి పంపారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వెళ్తుండటంతో ఇంటి బయట అభిమానులు సందడి చేశారు. గుమ్మడికాయతో దిష్టితీసి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.

First Published:  25 July 2024 8:33 AM GMT
Next Story