గ్రూప్-1 అభ్యర్థుల మీద లాఠీచార్జి అమానుషం : కేటీఆర్
అశోక్ నగర్‌లో గ్రూప్ -1 అభ్యర్థులపై పోలీసుల లాఠీ ఛార్జీని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే నిరుద్యోగులపై పోలీసుల జులుం చూపించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
BY Vamshi Kotas18 Oct 2024 9:05 PM IST
X
Vamshi Kotas Updated On: 18 Oct 2024 9:05 PM IST
అశోక్ నగర్‌లో గ్రూప్ -1 అభ్యర్థులపై పోలీసుల లాఠీ ఛార్జీని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే నిరుద్యోగులపై పోలీసుల జులుం చూపించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ తెలంగాణ ఉద్యమం నాటి అణచివేత చర్యలు.. అమ్మాయిలని కూడా చూడకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన రేవంత్ సర్కార్ను తెలంగాణ ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అశోక్ నగర్ కు వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పత్తా లేకుండా పోవడం దుర్మార్గమన్నారు. అభ్యర్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కేటీఆర్ భరోసా కల్పించారు. అరెస్ట్ చేసిన గ్రూప్ 1 అభ్యర్థులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
Next Story