వెంటాడిన ప్రమాదాలు.. ఎమ్మెల్యేగా కలిసిరాని కాలం
పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రమాదానికి గురయ్యారు లాస్య నందిత. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు.
సాయన్న వారసురాలిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన లాస్య నందితకు కాలం కలిసిరాలేదు. గడిచిన మూడు నెలలుగా ఆమెను ప్రమాదాలు వెంటాడాయి. కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమానికి హాజరైన టైమ్‌లో ఆమె లిఫ్టులో ఇరుక్కున్నారు. ఇది ఆమెకు తొలి ప్రమాదం. అయితే అప్పుడు సురక్షితంగా బయటపడ్డారు.
ఇక పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రమాదానికి గురయ్యారు లాస్య నందిత. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన కృష్ణా జలాల పరిరక్షణ సభకు వెళ్లి తిరిగివస్తుండగా.. నార్కట్‌పల్లి సమీపంలోని చర్లపల్లి దగ్గర ఆమె కారును ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగి పది రోజులు కూడా కాలేదు. ఆ టైమ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెను ఇంటికెళ్లి పరామర్శించారు. ఇక ఇవాళ ORR సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ప్రమాదాల్లోనూ ఆమె డ్రైవర్ ఒక్కరే.
This was about a week ago. Just now heard the absolutely tragic & shocking news that Lasya is no more !!
— KTR (@KTRBRS) February 23, 2024
Woke up to the devastating loss of the young legislator who was a very good leader in the making
My heartfelt prayers for strength to her family and friends in this terrible… https://t.co/CqpfrxMweU
లాస్య నందిత మృతి విషయం తెలుసుకున్న కేటీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. వారం రోజుల క్రితమే ఆమెను పరామర్శించానని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.