Telugu Global
Telangana

లగచర్ల బాధితులకు ఉరిశిక్ష పడుతుందని బెదిరిస్తున్నారు : ఎమ్మెల్సీ సత్యవతి

సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు.

లగచర్ల బాధితులకు ఉరిశిక్ష పడుతుందని బెదిరిస్తున్నారు : ఎమ్మెల్సీ సత్యవతి
X

ఎన్నో ఏళ్లుగా లగచర్ల గిరిజనులు ఆ భూములను ఆధారంగా చేసుకొని బతుకుతున్న వారి జీవనాధారాన్ని గుంజుకునే ప్రయత్నం చేశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు సృష్టించిన అరాచకంపై బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాలోతు కవితతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. గత 9 నెలలుగా తమ భూములు ఇవ్వమని లగచర్ల రైతులు చెబూతునే ఉన్నారని సత్యవతి రాథోడ్‌ అన్నారు. భూములు తీసుకుంటామంటే ఆవేశంలో కొంతమంది దాడి చేశారని చెప్పారు.

దాన్ని సాకుగా చూపి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అర్ధరాత్రి కరెంట్ తీసేసి, ఇంటర్ నెట్ బంద్ చేసి మహిళలను హింసించారని.. కొట్టారని.. బూతులు తిట్టారని అన్నారు. 51 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారని.. ఊళ్లో ఉన్న మగవాళ్లంతా పారిపోయారని చెప్పారు. 51 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారని.. ఊళ్లో ఉన్న మగవాళ్లంతా పారిపోయారని చెప్పారు. మళ్లీ ఏం చేస్తారోనని ఇప్పటికీ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ధర్మ పోరాటానికి అండగా ఉండాలని రైతులు అన్ని పార్టీల నాయకులను కోరారని సత్యవతి రాథోడ్‌ తెలిపారు. బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ కూడా పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంకా అరెస్ట్ లు చేస్తున్నారని పేర్కొన్నారు. బాధితులకు ఉరి శిక్ష పడుతుందని రేవంత్ రెడ్డి సోదరుడు బెదిరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  18 Nov 2024 2:07 PM IST
Next Story