Telugu Global
Telangana

హైదరాబాద్ లో రేపటి నుంచి లేడీస్ స్పెషల్..

ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలో మరిన్ని మార్గాల్లో లేడీస్ స్పెషల్ బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధంగా ఉందని తెలిపారు అధికారులు. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ప్రత్యేక బస్సును మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ లో రేపటి నుంచి లేడీస్ స్పెషల్..
X

హైదరాబాద్ లో రేపటి నుంచి లేడీస్ స్పెషల్..

మహిళలకోసం ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు సిద్ధమైంది తెలంగాణ ఆర్టీసీ. ముందుగా ఐటీ కారిడార్ లో వర్కింగ్ ఉమన్ కోసం ఈ బస్సుల్ని ప్రయోగాత్మకంగా నడపడానికి నిర్ణయించింది. సోమవారం నుంచి తొలి లేడీస్ స్పెషల్ బస్సు రోడ్డుపైకి వస్తుంది. ‘మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లేడీస్‌ స్పెషల్‌’ బస్సును అందుబాటులోకి తెస్తోంది టీఎస్ఆర్టీసీ.

‘మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ లేడీస్‌ స్పెషల్‌’ బస్సును సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ బస్సు జేఎన్టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు వెళ్తుంది. జేఎన్టీయూ నుంచి ఉదయం 9.05 గంటలకు బయలుదేరుతుంది. నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌ స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి క్రాస్ రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ క్రాస్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వేవ్ రాక్ వరకు వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5.50 గంటలకు వేవ్‌ రాక్‌ నుంచి బయలుదేరి ఆయా మార్గాల ద్వారా జేఎన్టీయూకు చేరుకుంటుంది.


త్వరలో మరిన్ని మార్గాల్లో..

ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలో మరిన్ని మార్గాల్లో లేడీస్ స్పెషల్ బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధంగా ఉందని తెలిపారు అధికారులు. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ప్రత్యేక బస్సును మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ నగర పరిధిలో ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు 5లక్షల మంది మహిళా ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నట్టు అంచనా. వారి కోసం ఇప్పుడీ ప్రత్యేక బస్సు సర్వీసు మొదలవుతోంది.

First Published:  30 July 2023 9:39 PM IST
Next Story