Telugu Global
Telangana

కేశవరావుపై ప్రశంసలు, రాహుల్‌కు ప్రశ్నలు.. కేటీఆర్ ట్వీట్

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకపోతే.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం షెడ్యూల్‌ 10 సవరణకు మీరు కట్టుబడి ఉన్నారని దేశం ఎలా నమ్ముతుందని ప్ర‌శ్నించారు.

కేశవరావుపై ప్రశంసలు, రాహుల్‌కు ప్రశ్నలు.. కేటీఆర్ ట్వీట్
X

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామా చేయడాన్ని స్వాగతించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే పార్టీ మారి కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభకు పోటీ చేసిన ఎమ్మెల్యే సంగతేంటని పరోక్షంగా దానం నాగేందర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు కేటీఆర్. ఆయనతో పాటు పార్టీ మారిన అర డజన్‌ మంది ఎమ్మెల్యేల సంగతి కూడా తేల్చాలన్నారు.


కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల చేరికపై మరోసారి రాహుల్‌కు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. రాహుల్‌ మీరు ఇలాగే రాజ్యాంగాన్ని రక్షించబోతున్నారా అంటూ తన ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకపోతే.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం షెడ్యూల్‌ 10 సవరణకు మీరు కట్టుబడి ఉన్నారని దేశం ఎలా నమ్ముతుందని ప్ర‌శ్నించారు. ఇదేం న్యాయపత్రం అంటూ ట్వీట్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు బీఆర్ఎస్‌ను వీడిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 32కు పడిపోయింది. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆ పార్టీ నేత‌ల‌తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. కాగా, ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ విష‌యంపై ఇప్పటికే హైకోర్టును సైతం ఆశ్రయించింది.

First Published:  4 July 2024 2:01 PM GMT
Next Story