Telugu Global
Telangana

ఎగ్జాక్ట్ పోల్స్ మాకే గుడ్‌ న్యూస్ చెప్తాయి- కేటీఆర్

అధికారం మాదే. హ్యాట్రిక్ కొడతాం. ఎగ్జిట్ పోల్స్ అంతా న్యూసెన్స్ నాన్సెన్స్. ఎవరూ కన్‌ఫ్యూజ్ కావొద్దు. మళ్లీ అధికారం మనదే. ఎన్నికల్లో కష్టపడిన పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు

ఎగ్జాక్ట్ పోల్స్ మాకే గుడ్‌ న్యూస్ చెప్తాయి- కేటీఆర్
X

ఎగ్జిట్‌ పోల్స్ అతి చేసినా.. ఎగ్జాక్ట్ పోల్స్ మాకు గుడ్‌ న్యూస్ చెప్తాయన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రచారం బిజీలో ఇన్నాళ్లు కంటిమీద కునుకు లేకుండా గడిపినా.. చాలా రోజుల తర్వాత రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టిందని చెప్పారు. తెలంగాణ ఫలితాలపై పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌పై ఇప్పటికే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంతా న్యూసెన్స్ నాన్సెన్స్ అన్నారు.


కేటీఆర్ నిన్న సాయంత్రం ప్రెస్‌మీట్‌లో ఏమన్నారంటే.." ఎగ్జిట్ పోల్స్ మాకు కొత్తేం కాదు. మేం మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తున్నాం. 70కి పైగా సీట్లలో గెలుస్తున్నాం. 2018లో కూడా ఎగ్జిట్‌ పోల్స్ తప్పని తేలాయి. ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. జనం లైన్లో ఇంకా ఓటేస్తుంటే మీరు ఎవరిని అడిగి ఈ పోల్స్‌ రిలీజ్ చేశారు. డిసెంబర్ 3 ఫలితాలు వచ్చాక తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా?. నేషనల్ మీడియా గతంలోనూ తప్పుడు సర్వేలు ప్రకటించాయి. వాటిని రాంగ్ అని ప్రూవ్ చేశాం. ఇప్పుడు అదే జరుగుద్ది. అధికారం మాదే. హ్యాట్రిక్ కొడతాం. ఎగ్జిట్ పోల్స్ అంతా న్యూసెన్స్ నాన్సెన్స్. ఎవరూ కన్‌ఫ్యూజ్ కావొద్దు. మళ్లీ అధికారం మనదే. ఎన్నికల్లో కష్టపడిన పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు" అని కేటీఆర్ చెప్పారు. తాజాగా మరోసారి ప్రతిపక్షాలకు చెక్ పెడుతూ గెలుపు మాధే అంటూ ట్వీట్ చేశారు.

First Published:  1 Dec 2023 2:13 PM IST
Next Story