ఇల్లు నాదే, నాలా నాదే.. అనుకుంటేనే బాగుపడతాం..
సూపర్ మార్కెట్లో కూడా దొరకని వస్తవులు హైదరాబాద్ నాలాల్లో కనపడ్డాయన్నారు. సోఫాలు, దిండ్లు, ఇతరత్రా వస్తువులు బయటపడ్డాయని చెప్పారు. పనికిరాని వస్తువులను నాలాల్లో ఎందుకు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు కేటీఆర్.
మంచి వ్యక్తిత్వం ఉంటే ఆ వ్యక్తి, లేదా కుటుంబం బాగుంటుంది. సమాజం బాగుండాలంటే అందరు వ్యక్తులు మంచిగా ఆలోచించాలి. అలాగే నగరం బాగుపడాలంటే పౌరుల భాగస్వామ్యం తప్పకుండా అవసరం అని అన్నారు మంత్రి కేటీఆర్. అందరం కలిసి కదిలితేనే మార్పు వస్తుందని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. దశాబ్ది ఉత్సవ స్ఫూర్తిని వివరించారు.
MA&UD Minister @KTRBRS delivering keynote address after inaugurating ReThink Knowledge Hub and Environmental Surveillance Laboratory at Administrative Staff College of India, Hyderabad. @ASCIMEDIA, @Urban_ASCI #WorldEnvironmentDay2023 https://t.co/uyYw4Dn1JQ
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 5, 2023
ఇల్లు మీదే, నాలా కూడా మీదే..
వానాకాలం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా హైదరాబాద్ నాలాల్లో పూడిక తీత పనులు మొదలు పెట్టామని, అయితే నాలాల్లో బయటపడే వస్తువులు చూస్తుంటే ఆశ్చర్యమేసిందని చెప్పారు మంత్రి కేటీఆర్. సూపర్ మార్కెట్లో కూడా దొరకని వస్తవులు హైదరాబాద్ నాలాల్లో కనపడ్డాయన్నారు. సోఫాలు, దిండ్లు, ఇతరత్రా వస్తువులు బయటపడ్డాయని చెప్పారు. పనికిరాని వస్తువులను నాలాల్లో ఎందుకు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇల్లు మాత్రమే నాది.. నాలా నాది కాదు అనే భావనతో బతకొద్దని సూచించారు. మనలో మార్పు రానంత వరకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఫలితం కనపడదన్నారు కేటీఆర్.
అన్నిట్లో మనమే నెంబర్-1
తొమ్మిదేళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణలో నాయకత్వం, మౌలిక వసతుల గురించి ఎన్నో అపోహాలు, అనుమానాలు ఉండేవని, కానీ దశాబ్ది ఉత్సవాల నాటికి మనం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్నామని వివరించారు కేటీఆర్. సాగునీరు, తాగునీరు, అటవీ సంపద, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వ్యవసాయం, విద్యుత్, శాంతి భద్రతలు.. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ తనదైన ముద్ర వేసిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఏ రంగాన్ని కూడా విస్మరించలేదని, అన్ని రంగాల్లో హైదరాబాద్, తెలంగాణ అగ్రభాగాన ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే చాలా మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉందని దానికి అందరి సమష్టి కృషి అవసరం అని అన్నారు.