Telugu Global
Telangana

ఇదిగో మా కృషికి సాక్ష్యం.. కేటీఆర్ ట్వీట్‌

గత దశాబ్ధకాలంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత మేలు చేసిందో నివేదిక ద్వారా చెప్పినందుకు నీతి ఆయోగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇది సాధ్యమైందన్నారు.

ఇదిగో మా కృషికి సాక్ష్యం.. కేటీఆర్ ట్వీట్‌
X

గత పదేళ్లలో తెలంగాణలో మల్టీ డైమెన్షనల్ పేదరికం గణనీయంగా తగ్గిందని స్పష్టం చేసింది నీతి ఆయోగ్. ఈ మేరకు ఓ రిపోర్టును రిలీజ్ చేసింది. 2013-14 నాటికి తెలంగాణలో మల్టీ డైమెన్షనల్ పేదరిక సూచీ 21.92గా ఉంటే.. 2022-23 నాటికి 3.76 శాతానికి తగ్గిందని తెలిపింది. మొత్తంగా 2013-14 నుంచి ఇప్పటివరకూ తెలంగాణలో దాదాపు 83 శాతం ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని నివేదిక తెలిపింది.

ఇక ఈ రిపోర్టును మిషన్ తెలంగాణ హ్యాండిల్‌ ట్వీట్ చేయగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎంతగానో గర్విస్తున్నామని చెప్పారు కేటీఆర్. గత దశాబ్ధకాలంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత మేలు చేసిందో నివేదిక ద్వారా చెప్పినందుకు నీతి ఆయోగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇది సాధ్యమైందన్నారు.


కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో తెలంగాణ సాధించిన గొప్ప సామాజిక-ఆర్థిక అభివృద్ధి ఇది అని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చారు. ఇది కేసీఆర్ ఎకనమిక్‌ సిస్టమ్‌ అని.. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని తప్పకుండా ఫాలో కావాలని సూచించారు. కేసీఆర్ దూరదృష్టికి ఈ అంకెలే నిదర్శనమని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఫామ్‌ కొన్ని రోజులే ఉంటుందని.. కానీ క్లాస్‌ మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.

First Published:  16 Jan 2024 10:38 AM IST
Next Story