నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ!
దేశ పారిశ్రామిక అభివృద్దిలో తెలంగాణది కీలక పాత్ర అని చెప్పిన కేటీఆర్, హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్ – నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్ – విజయవాడ పారిశ్రామిక కారిడార్ లకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.
తెలంగాణ పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. దేశాభివృద్ది జరగాలంటే రాష్ట్రాలు అభివృద్ది జరగాలని, తెలంగాణ వంటి వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాలకు సకరిస్తే దేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
దేశ పారిశ్రామిక అభివృద్దిలో తెలంగాణది కీలక పాత్ర అని చెప్పిన కేటీఆర్, హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్ – నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్ – విజయవాడ పారిశ్రామిక కారిడార్ లకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.
జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని, ఆదిలాబాద్ సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించాలని, హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని, హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, జడ్చర్ల పారిశ్రామిక పార్కులో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం చేయాలని, బ్రౌన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు మంజూరు చేయాలని కేటీఆర్ తన లేఖలో కోరారు.
రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ది కోసం సహకరించాలని, ప్రోత్సహకాలు ఇవ్వాలని గత ఎనిమిదేళ్ళుగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించిన కేటీఆర్ ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు సహకరించాలని కోరారు.