Telugu Global
Telangana

కవిత బెయిల్‌పై విమర్శలు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ కౌంటర్‌

నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో 2015 డిసెంబర్‌లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఇద్దరూ బెయిల్‌ పొందారన్నారు

కవిత బెయిల్‌పై విమర్శలు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ కౌంటర్‌
X

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది, అందుకే కవితకు బెయిల్‌ మంజూరయిందంటూ ఆరోపిస్తున్నారు.

కవితకు బెయిల్ వస్తుందని రెండు, మూడు రోజుల ముందే బీఆర్ఎస్‌ నేతలకు ఎలా తెలిసిందని, కవిత బెయిల్ కోసం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.


బీఆర్ఎస్‌, బీజేపీ పొత్తు అంటూ కాంగ్రెస్ నేతలు పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో 2015 డిసెంబర్‌లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఇద్దరూ బెయిల్‌ పొందారన్నారు. ఇక ఇండియా కూటమిలో ఆప్‌ భాగస్వామిగా ఉందని, ఆ పార్టీ నేత మనిష్ సిసోడియాకు వారం రోజుల క్రితం బెయిల్ మంజూరైందని గుర్తు చేశారు. ఇక ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా 2015 నుంచి బెయిల్‌పైనే ఉన్నారంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామాలన్ని కేంద్రంలో NDA ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయని, ఈ లెక్కన బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని తాను ఆరోపణ చేయొచ్చా అంటూ ప్రశ్నలు సంధించారు కేటీఆర్.

First Published:  28 Aug 2024 4:36 PM IST
Next Story