Telugu Global
Telangana

నేడు కేటీఆర్ చేతులమీదుగా యంగ్ వన్ గ్రూప్ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన

వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో యంగ్ వన్ గ్రూప్ ఆఫ్ కొరియాకు చెందిన ఫ్యాక్టరీల భూమిపూజలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

నేడు కేటీఆర్ చేతులమీదుగా యంగ్ వన్ గ్రూప్ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన
X

భారత దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్ గా పేరుతెచ్చుకున్న వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో ఈరోజు భారీ పరిశ్రమలకు శంకుస్థాపన జరగబోతోంది. కొరియాకు చెందిన యంగ్ వన్ గ్రూప్ ఇక్కడ భారీ పెట్టుబడులకు రంగం సిద్ధం చేసింది. యంగ్ వన్ గ్రూప్ రూ.900కోట్ల పెట్టుబడులతో 8 ఫ్యాక్టరీలు స్థాపించబోతోంది. ఈ ఫ్యాక్టరీలకు మంత్రి కేటీఆర్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. వీటి ద్వారా 12వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారాయన.


గీసుగొండ మండలం, శాయంపేటలో 1350 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్కు ఏర్పాటు చేసింది. ఈ పార్కులో ఇప్పటికే గణేశా ఎకోపెట్‌, గణేశా ఎకోటెక్‌ కర్మాగారాల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. కైటెక్స్ సంస్థకు చెందిన ఫ్యాక్టరీలు మరికొన్ని రోజుల్లో ప్రారంభమవుతాయి. దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. కేంద్రం దీన్ని పీఎం మిత్ర పథకానికి ఎంపిక చేసింది.

పరిశ్రమల కారిడార్ గా అవతరించబోతున్న ఈ టెక్స్ టైల్ పార్క్ లో ఇప్పడు భారీ ఫ్యాక్టరీలకోసం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. యంగ్ వన్ గ్రూప్ ఆఫ్ కొరియాకు చెందిన ఫ్యాక్టరీల భూమిపూజలో ఆయన పాల్గొంటారు. ఇప్పటి వర కు పార్కులో రూ 366.75 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించింది. పార్కులో పరిశ్రమలకు నీటి సౌకర్యం కోసం ప్రభుత్వం రూ 12.40 కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక్కడ తమ ఫ్యాక్టరీలు స్థాపించేందుకు క్యూ కడుతున్నాయి.

First Published:  17 Jun 2023 6:27 AM IST
Next Story