Telugu Global
Telangana

రేపు కవితను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్

కవితకు అన్ని రకాలుగా పార్టీ అండగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమెకు నైతిక మద్దతుగా నిలబడటానికి ఇప్పటికే మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , సత్యవతి రాథోడ్ లు ఢిల్లీలో ఉన్నారు. న్యాయపరంగా అండగా ఉండేందుకు ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు కూడా ఢిల్లీ వెళ్లారు.

రేపు కవితను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్
X

బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రేపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించనున్నది. ఆమెను ఈడీ అరెస్టు చేయవచ్చని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై తాము రాజకీయంగా పోరాడుతూ ఉంటే తమను నిలవరించడానికి ఆ పార్టీ జాతీయ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. కవిత కు నోటీసులివ్వడం, రేపు విచారణ జరపనుండటం కూడా కక్షసాధింపులో భాగమే అని కేసీఆర్ ఈ రోజు బీఆరెస్ పార్టీ విస్త్రుత స్థాయి సమావేశంలో వ్యాఖ్యానించారు. ''కవితను అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ.. అందర్నీ వేధిస్తున్నారు బీజేపీకి భయపడేది లేదు.. పోరాటం అస్సలు ఆపే ప్రసక్తే లేదు'' అన్నారు కేసీఆర్.

ఈ నేపథ్యంలో కవితకు అన్ని రకాలుగా పార్టీ అండగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమెకు నైతిక మద్దతుగా నిలబడటానికి ఇప్పటికే మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , సత్యవతి రాథోడ్ లు ఢిల్లీలో ఉన్నారు. న్యాయపరంగా అండగా ఉండేందుకు ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు కూడా ఢిల్లీ వెళ్లారు.

తాజాగా తన చెల్లికి అండగా నిలబడేందుకు మంత్రి కేటీఆర్ కొద్ది సేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం అయిపోయిన వెంటనే ఆయన‌ ఢిల్లీ బయల్దేరారు. అక్కడ కేటీఆర్ కవితకు నైతికంగా మద్దతుగా నిలబడటమే కాక ఢిల్లీలోని సీనియర్ లాయర్లతోనూ చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేటీఆర్ తో పాటు పలువురు బీఆరెస్ సీనియర్ నాయకులు కూడా ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తోంది.

First Published:  10 March 2023 9:21 PM IST
Next Story