Telugu Global
Telangana

నోరు పారేసుకోవద్దు.. నీకు 100 రోజులే టైమ్

కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. హైదరాబాద్ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటు వేశారని చెప్పారు.

నోరు పారేసుకోవద్దు.. నీకు 100 రోజులే టైమ్
X

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై, తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఘాటు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఆక్షేపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ మీద రేవంత్ నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. తమకు కూడా నోరుందని, కానీ 100 రోజుల వరకు ఓపిక పడతామని చెప్పారాయన. ఆ తర్వాత తమ నుంచి రియాక్షన్ మరో విధంగా ఉంటుందని హెచ్చరించారు కేటీఆర్.


కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. హైదరాబాద్ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటు వేశారని చెప్పారు. గ్రేటర్ పరిధిలో వచ్చిన ఫలితాలే దీనికి నిదర్శనం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని, లోక్ సభ ఎన్నికలనాటికి పరిస్థితిలో మార్పు రావాలన్నారు కేటీఆర్. వారి మాయమాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. 100 రోజుల్లో మరింత క్లారిటీ వస్తుందని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పాలనకు, ఇప్పటి కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాపై ప్రజల్లో చర్చ జరుగుతోందని చెప్పారు కేటీఆర్.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తేడా కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమేనని గుర్తు చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ కి 39 స్థానాలు వచ్చాయని, ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, దాన్ని మనం సమర్థంగా నిర్వహించాలని కూకట్ పల్లి నియోజకవర్గ నాయకులకు వివరించారు. హైదరాబాద్ గల్లీల్లోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయని, కాంగ్రెస్ పాలన ఎలా ఉందో స్పష్టంగా ప్రజలకు తెలిసొస్తోందని చెప్పారు. ప్రజలకు అండగా నిలబడాలని, తెలంగాణ గొంతు వినిపించే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేననే విషయం ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు కేటీఆర్.

First Published:  3 Feb 2024 3:11 PM IST
Next Story