ఇంత అహంకారమా, కండ కావరమా..? ఆడబిడ్డల ఉసురు తగులుతుంది జాగ్రత్త
మహిళా ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగి సొంత పరపతితో గెలిచి వచ్చారని, రేవంత్ రెడ్డి లాగా రాజకీయ విన్యాసాలు చేసి వచ్చినవారు కాదని, ఆ విషయం ఆయన గుర్తుంచుకోవాలని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
ఇంత అహంకారమా..?
ఇంత కండకావరమా..?
నికృష్టమైన మాటలు మాట్లాడతావా..?
తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగులుతుంది జాగ్రత్త..
అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలతో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వెంటనే తెలంగాణ ఆడబిడ్డలందరికీ సీఎం క్షమాపణలు చెప్పాలన్నారు. ఆయన సిగ్గు తెచ్చుకోవాలని, బుద్ధి తెచ్చుకోవాలని, లేకపోతే ఇంతకు ఇంత అనుభవిస్తారని హెచ్చరించారు.
అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS
— BRS Party (@BRSparty) July 31, 2024
♦️మా మహిళా శాసనసభ్యుల పైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారు
♦️అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారు
♦️ఈ అవమానం కేవలం… pic.twitter.com/n8OE3CKDIf
అకారణంగా, అసభ్యంగా, హీనాతి హీనమైన ప్రవర్తనతో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తమ మహిళా ఎమ్మెల్యేలను కష్టపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. అకారణంగా వారిపై రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారని మండిపడ్డారు. గతంలో ఎవరూ మాట్లాడనంత అసభ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడారని చెప్పారు. నోరు జారితే ఆ మాటల్ని వెనక్కి తీసుకుని విచారం వ్యక్తం చేయాలని, కనీసం రేవంత్ రెడ్డి ఆ పని కూడా చేయలేదన్నారు కేటీఆర్.
అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేను అవమానించిన సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల బృందం. pic.twitter.com/N22SHYOio2
— BRS Party (@BRSparty) July 31, 2024
ఇది కేవలం సబితక్క, సునీతక్కకు జరిగిన అవమానం కాదని, తెలంగాణ మహిళలందరికీ జరిగిన అవమానం అని అన్నారు కేటీఆర్. మహిళల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని, నట్టేట మునుగుతారన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం మర్యాదకరం కాదన్నారు. రేవంత్ రెడ్డి ఒక అన్ ఫిట్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. మహిళా ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగి సొంత పరపతితో గెలిచి వచ్చారని, రేవంత్ రెడ్డి లాగా రాజకీయ విన్యాసాలు చేసి వచ్చినవారు కాదని, ఆ విషయం ఆయన గుర్తుంచుకోవాలని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.