కేటీఆర్ సాయం.. ఆ ఇద్దరికి కొత్త జీవితం
కేటీఆర్ రాకతో ఆ రెండు కుటుంబాల్లో సంతోషం రెట్టింపైంది. కేటీఆర్ లేకపోతే తమ బతుకులు జైలులో మగ్గిపోయి ఉండేవని అన్నారు అన్నదమ్ములు మల్లేశం, రవి.
కేటీఆర్ మాట సాయం చేసి ఉండకపోతే, వారి గురించి పట్టించుకోకపోతే, దుబాయ్ పాలకుల్ని ఒప్పించకపోతే.. వారిద్దరూ ఇంకా జైలులోనే ఉండేవారు. దుబాయ్ శిక్షలు ఎంత కఠినమో అందరికీ తెలుసు. బయటపడే దారి తెలియక దుబాయ్ జైళ్లలో మగ్గిపోతున్న ఇతర దేశస్తులు ఎంతోమంది. అందులో భారతీయులు కూడా ఉన్నారు. కానీ 20 ఏళ్లుగా దుబాయ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు కేటీఆర్ చొరవ వల్ల ఇంటికి చేరారు.సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి.. దుబాయ్ జైలునుంచి విడుదలై.. సొంత ఊరికి చేరుకున్నారు. ఈ సందర్భంలో నేరుగా వారి ఇంటికే వెళ్లి అన్నదమ్ములిద్దరితోపాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్.
దుబాయ్లో 18 ఏండ్లుగా జైలు శిక్షఅనుభవించిన సిరిసిల్ల జిల్లా వాసులు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి కృషితో జైలు నుండి విడుదలై కొద్దిరోజుల క్రితమే సొంతూరికి చేరారు.
— BRS Party (@BRSparty) February 28, 2024
ఈ సందర్భంగా కేటీఆర్ ఈరోజు పెద్దూరు గ్రామానికి వెళ్లి వారిని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో… pic.twitter.com/EMA1lucoLZ
మీరు లేకపోతే..
కేటీఆర్ రాకతో ఆ రెండు కుటుంబాల్లో సంతోషం రెట్టింపైంది. కేటీఆర్ లేకపోతే తమ బతుకులు జైలులో మగ్గిపోయి ఉండేవని అన్నారు అన్నదమ్ములు మల్లేశం, రవి. క్షణికావేశంలో జరిగిన తప్పుకి దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తమను కేటీఆర్ కాపాడారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. దుబాయ్ జైలు నుంచి విడుదల చేయించినందుకు కేటీఆర్‌కు మల్లేశం, రవితో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 20 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నామని, జీవితంలో కుటుంబ సభ్యులను చూస్తామనుకోలేదని, కేటీఆర్ దయతోనే తాము విడుదలయ్యామని అన్నారు రవి, మల్లేశం. తమను విడుదల చేసేందుకు న్యాయసేవలతో పాటు మొత్తం 30 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, ఆ ఖర్చు మొత్తం కేటీఆర్ భరించారని చెప్పారు.
కేటీఆర్ కి పెద్దూరు నీరాజనం..
కేటీఆర్ వస్తున్నారని తెలియగానే పెద్దూరు మొత్తం అక్కడికి తరలి వచ్చింది. తమ ఊరివారికోసం కేటీఆర్ చేసిన సాయాన్ని మరచిపోలేమని చెప్పారు గ్రామస్తులు. గ్రామ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.