Telugu Global
Telangana

బీఆర్ఎస్వీ నాయకులకు కేటీఆర్ పరామర్శ

టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడితోపాటు, ఉస్మానియాలో జరుగుతున్న డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనల్లో కూడా బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు. వారి పోరాటాన్ని అభినందించారు కేటీఆర్.

బీఆర్ఎస్వీ నాయకులకు కేటీఆర్ పరామర్శ
X

తెలంగాణలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. పోస్ట్ ల సంఖ్య పెంచకపోయినా పర్లేదు, కనీసం ప్రిపరేషన్ కి టైమ్ కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలంటూ ఉద్యమం మొదలు పెట్టారు. ఈ ఉద్యమానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం(బీఆర్ఎస్వీ) మద్దతు తెలిపింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థుల తరపున బీఆర్ఎస్వీ కూడా నిరసనల్లో పాల్గొంటోంది. అయితే పోలీసులు మాత్రం వీరిపై దాడి చేసి గాయపరిచారు. పోలీసుల దాడుల్లో గాయపడిన బీఆర్ఎస్వీ నేతల్ని ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడితోపాటు, ఉస్మానియాలో జరుగుతున్న డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనల్లో కూడా బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు. వారి పోరాటాన్ని అభినందించారు కేటీఆర్. వారిపై పోలీసుల దాడిని ఖండించారు. పోలీసుల దాడిలో గాయపడిన నేతల్ని నందినగర్ లో కలిశారు కేటీఆర్. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి పోరాట పంథాను ప్రశంసించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోటీ పరీక్షల విషయంలో నిర్ణయం మార్చుకునేలా చేసేంత వరకు విశ్రమించేది లేదన్నారు కేటీఆర్.

పోరాట పంథా..

కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాట పంథాని కొనసాగిస్తామంటున్నారు కేటీఆర్. రాష్ట్రంలో అన్ని వర్గాల్లోనూ అశాంతి ఉందని చెప్పారు. రైతులను ప్రభుత్వం మోసం చేసిందని, ఉచిత సిలిండర్లు, ఇతరత్రా పథకాలతో మహిళల్ని మోసం చేస్తోందని, పరీక్షలు వాయిదా వేయకుండా ఇటు నిరుద్యోగులకు కూడా ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్వీ మద్దతు ఉంటుందని చెప్పారు కేటీఆర్.

First Published:  11 July 2024 11:51 AM GMT
Next Story