కేటీఆర్ వెరైటీ ఉగాది పంచాంగం.. చదివితే నవ్వాపుకోలేరు!
అదానీకి మోడీ ప్రభుత్వం ఎలా సహకరిస్తుందనే విషయాన్నిమంత్రి కేటీఆర్ ఇలా వ్యంగ్యంగా చెప్పారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిపై నిత్యం విమర్శలు గుప్పిస్తుంటారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయంపై ప్రశ్నిస్తుంటారు. అలాగే ఎవరైనా సహాయం అడిగితే ట్విట్టర్‌లో వెంటనే స్పందిస్తుంటారు. ఇక అప్పుడప్పుడు చలోక్తులు విసురుతూ నవ్వులు పూయిస్తుంటారు.
ఉగాది సందర్భంగా చాలా చోట్ల పంచాంగ శ్రవణం నిర్వహిస్తుంటారు. ఈ కొత్త ఏడాది ఎవరికి ఎలా ఉంటుందని పండితులు అంచనా వేస్తుంటారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా సరికొత్త రీతిలో పంచాంగం చెప్పారు. సోషల్ మీడియాలో తనకు వచ్చిన దాన్ని ఆయన ఫార్వర్డ్ చేశారు. 'ఆదాయం: అదానీకి! వ్యయం: జనానికి, బ్యాంకులకు! అవమానం: నెహ్రూకి! రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి! బస్, బభ్రాజీమానం భజగోవిందం! దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!' అంటూ తనదైన రీతిలో పంచాంగం చెప్పారు.
అదానీకి మోడీ ప్రభుత్వం ఎలా సహకరిస్తుందనే విషయాన్ని ఇలా వ్యంగ్యంగా చెప్పారు. అంతా గుజరాతీయులకే కట్టబెడుతున్నారంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేటీఆర్ పెట్టిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
As forwarded
— KTR (@KTRBRS) March 22, 2023
ఆదాయం: అదానీకి!
వ్యయం: జనానికి, బ్యాంకులకు!
అవమానం: నెహ్రూకి!
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!
బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!