Telugu Global
Telangana

6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. మళ్లీ 6 నెలల్లోనే - కేటీఆర్

గత పదేళ్లు కనిపించని కరెంటు కోతలను చూస్తున్నామన్నారు కేటీఆర్. విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్‌ఫార్మార్లను చూస్తున్నామన్నారు.

6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. మళ్లీ 6 నెలల్లోనే - కేటీఆర్
X

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనపై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విత్తనాల కోసం రైతులు క్యూలైన్‌లో పాస్ బుక్కులు పెట్టిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో కేటీఆర్ స్పందించారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. మళ్లీకాంగ్రెస్‌ 6 నెలల పాలనలోనే ఆవిష్కృతమయ్యాయంటూ ట్వీట్ చేశారు.


గత పదేళ్లు కనిపించని కరెంటు కోతలను చూస్తున్నామన్నారు కేటీఆర్. విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్‌ఫార్మార్లను చూస్తున్నామన్నారు. సాగునీరు లేక ఎండిన పోలాలను, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలాల్లో వాటర్ ట్యాంకర్లు, చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నామన్నారు. పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలల పాటు పడిగాపులు చూస్తున్నామన్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితిని చూస్తున్నామన్నారు కేటీఆర్. పదేళ్ల తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామన్నారు. చివరికి జోగిపేటలో విత్తనాల కోసం రైతుల మొక్కులు, క్యూలైన్‌లో పాస్ బుక్కులు చూశామంటూ కాంగ్రెస్‌ పాలనను ఎండగట్టారు. కాంగ్రెస్‌ తప్పులు ఆగడం లేదు.. రైతులకు తిప్పలు తప్పడం లేదంటూ ట్వీట్‌ చేశారు కేటీఆర్. ఈ వైఫల్యాల కాంగ్రెస్‌ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  22 May 2024 3:26 AM GMT
Next Story