తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు... దావోస్ పర్యటన విజయవంతం అని కేటీఆర్ ట్వీట్
2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు విజయవంతమైందని కేటీఆర్ ట్వీట్ చేశారు. 4 రోజుల్లో 52 వాణిజ్య సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు జరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్ లో వెల్లడించారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకరావడమే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు 2023 లో కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అధికారులు అనేక ఒప్పందాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు విజయవంతమైందని కేటీఆర్ ట్వీట్ చేశారు. 4 రోజుల్లో 52 వాణిజ్య సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు జరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్ లో వెల్లడించారు. ఈ పర్యటనలో తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు.
దావోస్ వేదికగా మైక్రో సాఫ్ట్, ఇన్‌స్పైర్ బ్రాండ్స్ తో సహా పలు కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. మైక్రో సాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
All thanks to my wonderful Team led ably by @jayesh_ranjan Garu https://t.co/uA6V2yY0S7
— KTR (@KTRTRS) January 21, 2023