కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు కేటీఆర్. అదే సమయంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఆయన అభినందనలు తెలిపారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫలితాలపై తాము నిరాశ చెందామని ఆయన ట్వీట్ చేశారు. కానీ తిరిగి పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు వెలువడిన ఫలితాలతో తాము బాధపడలేదు కానీ, అవి ఆశించినట్టు లేకపోవడంతో నిరాశ చెందామని తెలిపారు. ఈ ఫలితాలు నిరాశ కలిగించినా భవిష్యత్తులో తాము తిరిగి పుంజుకుంటామని చెప్పారు కేటీఆర్.
Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government
— KTR (@KTRBRS) December 3, 2023
Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back…
తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు..
బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు కేటీఆర్. అదే సమయంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఆయన అభినందనలు తెలిపారు. కంగ్రాచ్యులేషన్ టు కాంగ్రెస్ పార్టీ అంటూ ట్వీట్ చేశారు. గుడ్ లక్ అంటూ ఆ పార్టీ నేతల్ని, విజేతల్ని అభినందించారు.
ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత కూడా బీఆర్ఎస్ లో గెలుపు ధీమా సడల్లేదు. మెజార్టీ సీట్లు తగ్గినా.. అధికారం మాత్రం తమకే దక్కుతుందని ఆశించారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి ఫలితాలు కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైంది. దీంతో కేటీఆర్ ఆ పార్టీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ వేశారు. సిరిసిల్లలో కేటీఆర్ 29వేల మెజార్టీతో విజయం సాధించారు.
♦