ఫ్రమ్ గుడ్ టు గ్రేట్.. వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్
అభివృద్ధి చేసుకున్నాం సరే, మరిప్పుడు మనం ఏంచేయాలనేది ఇక్కడ ఆసక్తికర అంశం. మంచి స్థానం నుంచి మహోన్నతస్థానం వరకు మన ఎదుగుదల ఉండాలి అని ఆకాంక్షించారు కేటీఆర్.
తెలంగాణ ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ ఆలోచనాత్మకంగా ట్వీట్లు వేస్తున్నారు. ఎట్లుంది తెలంగాణ, ఎట్లైంది తెలంగాణ అంటూ.. ఆయన ఏకంగా ఓ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. అదిప్పుడు పీక్ స్టేజ్ కి చేరుకుంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రచారాస్త్రంగా 'ఎట్లుంది-ఎట్లైంది' అనేది మారిపోయింది. తాజాగా మరోసారి ఓ ఆసక్తికర వీడియోతో ట్వీట్ పెట్టారు కేటీఆర్. ఫ్రమ్ గుడ్ టు గ్రేట్.. అంటూ కేటీఆర్ వేసిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది.
We built this
— KTR (@KTRBRS) November 24, 2023
With our hands
With our blood
We carved our own identity.
We wrote our own history
We did this
You did this
Together!
Now
Its time for even more
Time to grow even faster
To rise even higher
Together
Now more than ever
let’s go from Good to Great!… pic.twitter.com/ZGGfw2Whq1
తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యం ఉందని చెప్పారు మంత్రి కేటీఆర్. మనం దీన్ని ఉమ్మడిగా నిర్మించుకున్నామని, మన చేతులతో, మన రక్తంతో మన చరిత్రను మనమే తిరగరాసుకున్నామని చెప్పారు. మన ఉనికిని మనమే గొప్పగా చాటుకున్నామని అన్నారు. మీరు, మేము.. మనందరం కలసి సాధించుకున్న అభివృద్ధి ఇదని వివరించారు.
ఇప్పుడేం చేయాలి..?
అభివృద్ధి చేసుకున్నాం సరే, మరిప్పుడు మనం ఏంచేయాలనేది ఇక్కడ ఆసక్తికర అంశం. సాధించుకున్న అభివృద్ధిని మరింత మెరుగుపరచుకోవాలి, మునుపటికంటే మరింత మెరుగ్గా మనం అభివృద్ధి చెందాలి, మంచి స్థానం నుంచి మహోన్నతస్థానం వరకు మన ఎదుగుదల ఉండాలి అని ఆకాంక్షించారు కేటీఆర్. అలాంటి టైమ్ ఇప్పుడు వచ్చిందని, ఆ సంధి కాలంలో మనం ఉన్నామని, అందుకే మరోసారి అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు.