Telugu Global
Telangana

ఇది తెలంగాణ దశాబ్ది.. వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది

ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా, స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని, సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా.. తెలంగాణలో ఆవిష్కృతమైందని చెప్పారు కేటీఆర్.

ఇది తెలంగాణ దశాబ్ది.. వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది
X

2014 జూన్-2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. సరిగ్గా ఈ ఏడాది జూన్-2తో తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ వేశారు.


ఆరున్నర దశాబ్దాల పోరాటం..

మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..

వేల బలిదానాలు, త్యాగాలు..

బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..

ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..

ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది! అని తన ట్వీట్ లో పేర్కొన్నారు కేటీఆర్.

ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా, స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని, సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా.. తెలంగాణలో ఆవిష్కృతమైందని చెప్పారు కేటీఆర్. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసిందని, ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండి, ఐటీ ఎగుమతుల దాకా రికార్డులు బద్దలయ్యాయని అన్నారు. ప్రజలందరి మద్దతుతో నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచామని చెప్పారు. నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపామన్నారు. రైతన్నల, నేతన్నల, కష్టజీవుల కలత తీర్చి, కడుపు నింపామని చెప్పారు కేటీఆర్.

కేసీఆర్ పాలన సాక్షిగా

ఇది తెలంగాణ దశాబ్ది!

వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది! అని అన్నారు కేటీఆర్.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. రోజుకొక విభాగానికి సంబంధించి ఉత్సవాలు నిర్వహించారు. ప్రజల్ని కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేశారు. మరి ఈసారి ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో చూడాలి.

First Published:  22 May 2024 7:48 AM IST
Next Story