Telugu Global
Telangana

పెట్టుబడుల పేరుతో ఇంత మోసమా..? -కేటీఆర్

ప్రజలను మోసం చేసేందుకే షెల్ కంపెనీలు, స్కాంగ్రెస్ వ్యూహాలు అంటూ ట్వీట్ వేశారు కేటీఆర్.

పెట్టుబడుల పేరుతో ఇంత మోసమా..? -కేటీఆర్
X

తెంలగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమ్ అమెరికా పర్యటనలో ఉంది. అక్కడ కొన్ని కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు అధికారిక ప్రకటనలు విడుదలవుతున్నాయి. అయితే సదరు కంపెనీలు షెల్ కంపెనీలు అని, కేవలం పెట్టుబడుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క్రిశాంక్ చొరవను మెచ్చుకుంటూ స్కాంగ్రెస్ మోసాలను ప్రజలు గమనించాలంటూ ట్వీట్ వేశారు.


వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో బయో ఫ్యూయల్‌ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు న్యూయార్క్‌లో సీఎం రేవంత్‌ బృందం ‘స్వచ్ఛ్‌ బయో’ అనే కంపెనీతో ఒప్పందం చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ కంపెనీ ‘స్వచ్ఛ్‌ బయో’కాదు.. ‘స్వచ్ఛ్‌ బయోగ్రీన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆరోపించడమే కాదు, ఫొటో సాక్ష్యాలతో సహా రుజువు చేసింది. ఆ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు రేవంత్‌ తమ్ముడు ఎనుముల జగదీశ్వర్‌రెడ్డి అని, అందులో ప్రధాన వాటాదారు రేవంత్‌కు సన్నిహితుడైన హర్ష పసునూరి అని సాక్ష్యాలను సేకరించి ప్రజల ముందు ఉంచింది.

గతంలో దావోస్ సదస్సులో కూడా ఇలానే పెట్టుబడుల పేరుతో మోసం చేశారంటూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు కేటీఆర్. ఇప్పుడు అమెరికాలో తమ్ముడి కంపెనీ పేరుతో మరోసారి మోసానికి తెరతీశారని అన్నారు. ప్రజలను మోసం చేసేందుకే షెల్ కంపెనీలు, స్కాంగ్రెస్ వ్యూహాలు అంటూ ట్వీట్ వేశారు కేటీఆర్.

First Published:  8 Aug 2024 8:35 AM IST
Next Story