Telugu Global
Telangana

హైదరాబాద్ స్టార్టప్ కి కేటీఆర్ శుభాకాంక్షలు

బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో హైలెన్ర్ వంటి ఎన్నో సంస్థలు వినూత్న ఆవిష్కరణలకోసం ప్రయత్నించాయి. ఆ ఫలాలు ఇప్పుడు వారికి అందాయి.

హైదరాబాద్ స్టార్టప్ కి కేటీఆర్ శుభాకాంక్షలు
X

గ్లోబల్ ఎనర్టీ మార్కెట్ లో సత్తా చూపాలంటూ హైలెన్ర్ టెక్నాలజీస్ సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టేబుల్ టాప్ న్యూక్లియర్ రియాక్టర్ ని హైలెన్ర్ సంస్థ ప్రవేశ పెట్టిన సందర్భంగే కేటీఆర్ ఈమేరకు ట్వీట్ వేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీతో క్లీన్ ఎనర్జీని తయారు చేసేందుకు ఈ టేబుల్ టాప్ న్యూక్లియర్ రియాక్టర్ ఉపయోగపడుతుంది. హైదరాబాద్ కి చెందిన స్టార్టప్ కంపెనీ ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు కేటీఆర్.


ఈ టేబుల్ టాప్ న్యూక్లియర్ రియాక్టర్ తయారీకోసం ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలు ఉపయోగించలేదని, ఈ రియాక్టర్ వల్ల ఎలాంటి రేడియో ధార్మిక వ్యర్థాలు బయటకు రావని హైలెన్ర్ సంస్థ సీఈఓ సిద్ధార్థ దురై రాజన్ చెప్పారు. కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీకి సంబంధించి ఈ సంస్థ భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కుని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ పనితీరుకి, వారి ఆవిష్కరణకు ప్రశంసలు లభించాయి. కేటీఆర్ కూడా ఈ ఆవిష్కరణ విషయంలో వారిని అభినందించారు.

బీఆర్ఎస్ హయాంలో స్టార్టప్ కంపెనీలకు భారీ ప్రోత్సాహం లంభించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతోనే హైలెన్ర్ వంటి ఎన్నో సంస్థలు వినూత్న ఆవిష్కరణలకోసం ప్రయత్నించాయి. ఆ ఫలాలు ఇప్పుడు వారికి అందాయి. దీంతో కేటీఆర్ ఆ సంస్థను అభినందిస్తూ ట్వీట్ వేశారు. మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు.

First Published:  22 July 2024 3:25 AM GMT
Next Story