Telugu Global
Telangana

కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం ఇదే

కేటీఆర్ షేర్ చేసిన ట్వీట్ లో 2015 నుంచి 2022 మధ్య కాలంలో భారత్ లో అన్నదాతల ఆత్మహత్యల గణాంకాలున్నాయి.

కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం ఇదే
X

ఫార్మర్ ఫస్ట్.. అనే నినాదంతో కేసీఆర్ దాదాపు పదేళ్లు సంక్షేమ ప్రభుత్వాన్ని కొనసాగించారని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలంగాణలో ఏడాదికేడాది రైతుల ఆత్మహత్యల సంఖ్య తగ్గుతూ వచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్.


కేటీఆర్ షేర్ చేసిన ట్వీట్ లో 2015 నుంచి 2022 మధ్య కాలంలో భారత్ లో అన్నదాతల ఆత్మహత్యల గణాంకాలున్నాయి.

కేసీఆర్ హయాంలో “రైతు బంధు” పథకం ద్వారా 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని, 73వేల కోట్ల రూపాయల పంపిణీ జరిగిందన్నారు కేటీఆర్. భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ ఇన్‌పుట్ సహాయ కార్యక్రమంగా రైతుబంధుకి ఘనత దక్కిందన్నారు. ఇక “రైతు బీమా” కూడా మరో విప్లవాత్మక కార్యక్రమం అన్నారు కేటీఆర్. ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత బీమాను ప్రభుత్వం ఉచితంగా అందించిందన్నారు. రెండు విడతల్లో రైతులకు 25వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని వివరించారు కేటీఆర్. 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందించామని, మిషన్ కాకతీయ ద్వారా వేలాదిగా చెరువుల్ని పునరుద్ధరించి సాగునీటికి లోటు లేకుండా చేశామనన్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్ట్ లతో సాగునీటి పంపిణీలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు కేటీఆర్.

ఇక కేటీఆర్ షేర్ చేసిన ట్వీట్ లో 2015 నుంచి 2022 మధ్య కాలంలో భారత్ లో అన్నదాతల ఆత్మహత్యల గణాంకాలున్నాయి. 2015లో దేశంలో జరిగిన ఆత్మహత్యల్లో తెలంగాణ నుంచి 11.1 శాతం ఉన్నాయి. 2022నాటికి అది 1.57శాతానికి తగ్గిపోయింది. కేసీఆర్ రైతు సంక్షేమ ప్రభుత్వ విధానాల వల్లే ఈ మార్పు జరిగిందని అంటున్నారు కేటీఆర్.

First Published:  25 Jun 2024 11:00 AM IST
Next Story