Telugu Global
Telangana

మొహబ్బత్‌ కా దుకాణ్‌ ఇదేనా.. రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న

కాంగ్రెస్‌ పార్టీ పోలీసుల మద్దతుతో తిరిగి హింసను ప్రేరేపిస్తోందన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌ నీచ స్థితిని, థర్డ్ గ్రేడ్ రాజకీయాలను తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, భవిష్యత్తులో తప్పకుండా సమాధానం చెప్తారన్నార‌ని హెచ్చ‌రించారు.

మొహబ్బత్‌ కా దుకాణ్‌ ఇదేనా.. రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
X

సిద్దిపేటలో హరీష్‌ రావు క్యాంప్ ఆఫీసుపై దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీనియర్ ఎమ్మెల్యే హరీష్‌ రావు నివాసంపై దాడిని ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. గడిచిన పదేళ్లలో కుట్ర రాజకీయాలు, రాజకీయ దాడులు లేకుండా తెలంగాణ ప్రశాంతంగా ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ పోలీసుల మద్దతుతో తిరిగి హింసను ప్రేరేపిస్తోందన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌ నీచ స్థితిని, థర్డ్ గ్రేడ్ రాజకీయాలను తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, భవిష్యత్తులో తప్పకుండా సమాధానం చెప్తారన్నార‌ని హెచ్చ‌రించారు.


కాంగ్రెస్‌ సీనియర్ నేత రాహుల్‌ గాంధీకి ప్రశ్నలు సంధించారు కేటీఆర్. మీరు చెప్పే మొహబ్బత్‌ కా దుకాణ్‌ ఇదేనా అని ప్ర‌శ్నిస్తూ రాహుల్‌ గాంధీని తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు కేటీఆర్. తెలంగాణలో మాత్రం మొహబ్బత్‌ కే బజార్‌ మే నఫ్రత్‌కా దుకాణ్‌ తెరిచారంటూ మండిడ్డారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని స్వయంగా చెప్పుకునే వారికి ఈ ఘటన సిగ్గు చేటన్నారు.


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన పదేళ్లలో ప్రత్యర్థులపై ఇలాంటి దాడుల సంస్కృతి చూడలేదు. మరోవైపు హామీల అమలు విషయంలో కొద్ది రోజులుగా అటు అసెంబ్లీలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్, హరీష్‌ రావు ఇరుకున పెడుతున్నారు. ఎప్పటికప్పుడూ పక్కా లెక్కలతో ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. దీంతో ఈ ఇద్దరిని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు, తాజాగా హరీష్‌ రావు క్యాంప్‌ ఆఫీసుపై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.

First Published:  17 Aug 2024 5:27 AM GMT
Next Story