Telugu Global
Telangana

స్టూడెంట్స్‌కు బ్రేక్‌ ఫాస్ట్ స్కీమ్‌.. కేటీఆర్ స్పెషల్‌ రిక్వెస్ట్‌

కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల కోసం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిందని, తర్వాత మరింత విస్తరించాలని ప్లాన్ చేసిందని గుర్తుచేశారు.

స్టూడెంట్స్‌కు బ్రేక్‌ ఫాస్ట్ స్కీమ్‌.. కేటీఆర్ స్పెషల్‌ రిక్వెస్ట్‌
X

తెలంగాణలో స్టూడెంట్స్‌ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. దాదాపు రాష్ట్రంలోని 23 లక్షల మంది విద్యార్థులకు మేలు చేసేలా ఈ పథకం అమలు చేసింది గ‌త కేసీఆర్‌ సర్కార్‌. ఈ స్కీమ్‌ కోసం ప్రత్యేకంగా మెనూ కూడా తయారు చేశారు. పిల్లలకు పోషకాహారాన్ని అందించడం, హాజరు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ స్కీమ్‌ను ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ స్కీమ్‌ను అటకెక్కించింది.


బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ రద్దుపై తాజాగా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు కేటీఆర్. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల కోసం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిందని, తర్వాత మరింత విస్తరించాలని ప్లాన్ చేసిందని గుర్తుచేశారు. కానీ, తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అనాలోచితంగా బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ను రద్దు చేసిందన్నారు. తిరిగి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించాలని రేవంత్‌ సర్కార్‌ను కోరారు.

తమిళనాడులోనూ ఈ తరహా స్కీమ్‌ 2022 నుంచి అమలులో ఉన్న విషయం తెలిసిందే. పైలెట్‌ ప్రాజెక్టుగా చెన్నైలో ప్రారంభించి తర్వాత మిగతా జిల్లాలకు విస్తరించారు ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌. మొత్తంగా తమిళనాడులో దాదాపు 23 లక్షల మంది స్కూల్‌ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందుతోంది. విద్యార్థుల కోసం గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన బ్రేక్‌ఫాస్ట్ ప‌థ‌కాన్ని కొన‌సాగించాల‌ని రేవంత్‌ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు కేటీఆర్.

First Published:  16 July 2024 10:45 AM IST
Next Story