Telugu Global
Telangana

మతాల గురించి కొట్టుక చావమని ఏ దేవుడు చెప్పాడు? .. కేటీఆర్

మతాల పై కొట్టుకోవాలని ఏ దేవుడూ చెప్పలేదని కేటీఆర్ అన్నారు. కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా? నా మనుషుల‌ను పంపిస్తున్నా భూమి మీద‌కు.. ఒక‌రికొక‌రు త‌న్నుకు చావండి.. ఎవ‌రి దేవుడు గొప్ప‌ అనే కాంపిటీష‌న్ పెట్టుకొని త‌న్నుకు చావండి అని చెప్పిండా? అని కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

మతాల గురించి కొట్టుక చావమని ఏ దేవుడు చెప్పాడు? .. కేటీఆర్
X

ఎక్కడా లేని సంక్షేమం తెలంగాణాలో అమలవుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉచితాల గురించి ప్రధాని మోడీ లేవనెత్తిన చర్చ పట్ల ఆయన స్పందిస్తూ బియ్యం, ఉచిత విద్యుత్ ఇస్తే తప్పా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..

అన్నం లేక మరణిస్తే సిగ్గుచేటవుతుందని, విద్య, వైద్యసౌకర్యాలు కల్పించినా అది ఉచితమే అవుతుందా అన్నారు. 12 లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు.. కానీ కీలకమైన వీటిపై దృష్టి సారించరన్న ఆయన.. విశ్వగురువు ఎన్ని బిల్డప్ లు ఇచ్చినా భారత్ పేద దేశమే అవుతుందని మోడీనుద్దేశించి వ్యాఖ్యానించారు. మునావర్ పై పంచాయితీ పెడుతున్నారని, మతాల పై కొట్టుకోవాలని ఏ దేవుడూ చెప్పలేదని కేటీఆర్ అన్నారు. కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా? నా మనుషుల‌ను పంపిస్తున్నా భూమి మీద‌కు.. ఒక‌రికొక‌రు త‌న్నుకు చావండి.. ఎవ‌రి దేవుడు గొప్ప‌ అనే కాంపిటీష‌న్ పెట్టుకొని త‌న్నుకు చావండి అని చెప్పిండా? అని కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మ‌తాల మీద ప‌డి మ‌నం ఎక్క‌డ్నో పోతున్నాం. చైనా వాడేమో 16 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరిండు. మ‌నం ఏమో 3.1 ట్రిలియ‌న డాల‌ర్ల వ‌ద్ద‌నే ఆగిపోయాం.మునావర్ షో పై ఇటీవల కొన్ని శక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఈ మాటలన్నారు.




First Published:  27 Aug 2022 4:16 PM IST
Next Story