'గోలీమారో సాలోంకో' అనొచ్చు కానీ అవినీతి అనే పదం మాత్రం వాడొద్దా... కేటీఆర్ ప్రశ్న
పార్లమెంటులో కొన్ని పదాలను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్షలు వస్తున్నాయి. దీనిపై విపక్షాలు కేంద్రంపై ధ్వజమెత్తుతుండగా ఈ విషయంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.
పార్లమెంటులో కొన్ని పదాలను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్షలు వస్తున్నాయి. దీనిపై విపక్షాలు కేంద్రంపై ధ్వజమెత్తుతుండగా ఈ విషయంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. పదాల నిషేదంపై మండిపడ్డారు. మోదీ , ఆయన మంత్రులు, వారి పార్టీ నాయకులు ఏమైనా మాట్లాడొచ్చు కానీ ఇతరులు మాట్లాడిన మాటలు మాత్రం తప్పా ? అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశించారు.
NPA ప్రభుత్వ పార్లమెంటరీ భాష అనే హెడ్డింగ్ తో...
ఉద్యమకారులను ప్రధాని "ఆందోళన్ జీవి" అని పిలవడం సరైంది.
'' గోలీ మారో సలోన్ కో" అని ఓ మంత్రి చేసిన ఉపన్యాసం సరైందే.
మతాల మధ్య విభజన చేస్తూ "80-20" అని యూపీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు సరైనవే.
మహాత్మా గాంధీని బీజేపీ ఎంపీ కించపరిచిన తీరు బాగానే ఉంది.
ఉద్యమిస్తున్న రైతులను టెర్రరిస్టులని అవమానించడం సరైనదే.
కానీ అవినీతి, రక్తపాతం, క్రూరత్వం, డ్రామా, మోసం, మోసం చేశాడు, బొద్దింకలు, అత్యాచారం, ద్రోహం, నకిలీ, తప్పు, దురాశ, అసత్యం, అబద్దాలకోరు...తదితర పదాలు వాడటం తప్పు. అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Parliamentary language of NPA Govt
— KTR (@KTRTRS) July 16, 2022
✅ PM calling protesters "Andolan Jeevi" is fine
✅" Goli Maaron Saalon Ko" by Minister is okay
✅ "80-20" by UP Chief Minister is okay
✅ Denigration of Mahatma Gandhi by BJP MP is fine
✅ Farmer protesters insulted as "Terrorists" is fine pic.twitter.com/0Q4nfUmuET
కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ కు నెటిజనులనుంచి విపరీతమైన స్పందన వస్తోంది. కామెంట్లు, షేర్లు చేస్తూ నెటిజనులు మోదీపై మండిపడుతున్నారు.
'దీదీ....ఓ దీదీ' అని మోదీ మాట్లాడటం ఆయనకు బాగానే ఉంటుంది కానీ #JumlaJeevi అనే పదం మాత్రం ఆయనను కలవరపెడుతోంది! అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా బ్యాన్ చేసిన అన్ని పదాలకు బదులుగా నరేంద్ర మోదీ అనే రెండు పదాలతో భర్తీ చేయవచ్చు అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
కాగా లోక్‌సభ సెక్రటేరియట్ ఉభయ సభలకు "అన్‌పార్లమెంటరీ"గా పరిగణించబడిన పదాల కొత్త జాబితాను విడుదల చేసింది.జూలై 18న జరగనున్న వర్షాకాల సమావేశానికి ముందు ఈ జాబితా వచ్చింది.
'జుమ్లజీవి',పిల్లల వేశాలు, 'కోవిడ్ వ్యాప్తి', 'స్నూప్‌గేట్', 'సిగ్గు', 'దుర్వినియోగం', 'ద్రోహం', 'అవినీతి', 'నాటకం', 'వంచన', 'అసమర్థత' 'లైంగిక వేధింపులు' వంటి పదాలు ', 'నౌటంకి', 'ధిండోరా పీట్నా' వంటి కొన్ని పేర్లు పార్లమెంటులో ఉపయోగించకూడనివిగా జాబితాలో పేర్కొన్నారు.