Telugu Global
Telangana

రాహుల్‌ భ్రమలో ఉన్నావా.. డ్రామాలు చేస్తున్నావా..? - కేటీఆర్ ఫైర్‌

నాట్ల టైంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని.. పార్లమెంట్ ఓట్ల దాకా లాగదీశారన్నారు కేటీఆర్. పాత రైతుబంధు పూర్తిగా అందలేదన్న కేటీఆర్.. ఇక రైతుభరోసా అడ్రస్సే లేదన్నారు.

రాహుల్‌ భ్రమలో ఉన్నావా.. డ్రామాలు చేస్తున్నావా..? - కేటీఆర్ ఫైర్‌
X

తెలంగాణలోని రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా న‌గ‌దు జ‌మ చేశామన్న కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ భ్రమలో ఉన్నారా.. లేక తెలంగాణ ప్రజలతో డ్రామాలు ఆడుతున్నారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. వేయని రైతు భరోసా వేసినట్టు.. ఎందుకీ అబద్ధాలు.. ఎందుకీ అసత్యాలు అంటూ నిలదీశారు. ఎక్కడన్నా ఒక్కరైతుకన్నా.. ఎకరానికి రూ. 7,500 వచ్చిందో చెప్పాలన్నారు.


నాట్ల టైంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని.. పార్లమెంట్ ఓట్ల దాకా లాగదీశారన్నారు కేటీఆర్. పాత రైతుబంధు పూర్తిగా అందలేదన్న కేటీఆర్.. ఇక రైతుభరోసా అడ్రస్సే లేదన్నారు. నాడు రూ.15 లక్షలు ఇస్తానని బడాభాయ్ వేయలేదని.. ఇవాళ ఛోటా బాయ్‌ రూ.15 వేలు ఇయ్యలేదన్నారు. మరీ రైతుభరోసా వేసినట్లు ఎందుకీ ఫోజులని ప్రశ్నించారు. అసత్యాలపై కాంగ్రెస్‌ స్వారీ ఇంకెన్ని రోజులన్నారు.

డిసెంబర్ 9న చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ జాడేదన్నారు కేటీఆర్. కౌలు రైతులకు, కూలీలకు చేస్తానన్న సాయం సంగతేంటని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన పాపానికి ఏంటి ఈ నయవంచన అంటూ ట్వీట్ చేశారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గాలి మాటల గ్యారెంటీలను నమ్మి తెలంగాణ ఆగమైందన్నారు కేటీఆర్.

First Published:  9 May 2024 10:51 PM IST
Next Story