మీకు డిగ్రీలు ఎవడిచ్చాడు రా.. కంగనాపై కేటీఆర్ సెటైర్లు
ఇటీవల టైమ్స్ నౌ నిర్వహించిన ఓ సమ్మిట్‌లో మాట్లాడిన కంగనా రనౌత్.. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్లిపోయారంటూ మాట్లాడారు.
బీజేపీ అభ్యర్థుల పీఎం కామెంట్స్‌పై సెటైర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఉత్తరాదిన ఓ బీజేపీ అభ్యర్థి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సుభాష్ చంద్రబోస్ అని చెప్తోందని.. పరోక్షంగా కంగనా రనౌత్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇక దక్షిణాదికి చెందిన మరో అభ్యర్థి మహాత్మా గాంధీ మన పీఎం అంటున్నారంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. వీళ్లంతా ఎక్కడ డిగ్రీలు చదివారంటూ సెటైర్ వేశారు. ఈ ట్వీట్‌కు నవ్వుతున్న ఎమోజీని కూడా జత చేశారు.
One BJP candidate from North says Subash Chandra Bose was our first PM !!
— KTR (@KTRBRS) April 5, 2024
And another BJP leader from South says Mahatma Gandhi was our PM !!
Where did all these people graduate from?
ఇటీవల టైమ్స్ నౌ నిర్వహించిన ఓ సమ్మిట్‌లో మాట్లాడిన కంగనా రనౌత్.. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్లిపోయారంటూ మాట్లాడారు. ఈ వీడియో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కంగనాను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.
‘सुभाष चंद्र बोस, आज़ाद हिंदुस्तान के पहले प्रधानमंत्री थे.’
— ज्ञानी बाबा BOND (@BABAGYANIBOND) April 5, 2024
इनको हल्के में ना लें - BJP शिरोमणियों की लिस्ट में यह आगे जायेंगी#KanganaRanaut #KanganaRanaut pic.twitter.com/uzSKWwZBBj
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ సారి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ స్థానం నుంచి ఆమె అభ్యర్థిగా ఉన్నారు. ఇక 2020లో కంగనా రనౌత్‌కు పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది కేంద్రం.