అది డిక్లరేషన్ సభ కాదు.. కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ.. కేటీఆర్ సెటైర్
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీలు వెనుకబడి ఉన్నారంటే దానికి కారణం.. ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సెటైర్లు వేశారు. అది డిక్లరేషన్ సభ కాదని, అధికారం రానే రాదనే కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ అని తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం రాత్రి ఈ మేరకు ట్వీట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట విజన్ లేని కాంగ్రెస్ ఇచ్చిన డజను హామీలు గాల్లో దీపాలేననే విషయం చైతన్యానికి ప్రతీక అయిన తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.
అది డిక్లరేషన్ సభ కాదు...
— KTR (@KTRBRS) August 27, 2023
అధికారం రానే రాదనే...
కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ
కర్ణాటకలో కనీసం రేషన్.. ఇవ్వలేని కాంగ్రెస్
తెలంగాణకొచ్చి డిక్లరేషన్.. ఇస్తే నమ్మేదెవరు ?
గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు
మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిది
చైతన్యానికి ప్రతీకైన
తెలంగాణ ప్రజలకు…
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీలు వెనుకబడి ఉన్నారంటే దానికి కారణం.. ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. దళిత, గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే.. ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే అర్హత లేదని పేర్కొన్నారు. ఇవ్వని హామీలెన్నో అమలుచేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అని ఆయన వివరించారు. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదని, కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని కేటీఆర్ విమర్శించారు. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే.. అని ట్వీట్ చేశారు.
*