Telugu Global
Telangana

గాడ్సేకి నోబెల్ ప్రైజ్ అడుగుతారేమో.. కేటీఆర్ సెటైర్లు!

తాజాగా జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘గాంధీజీకి లా డిగ్రీ ఉందనే అపోహ ఉంది. ఆయనకు ఒక్క డిగ్రీ కూడా లేదని మీకు తెలుసా? ఆయన ఏకైక అర్హత హైస్కూల్ డిప్లొమా. లా ప్రాక్టీస్ చేయడానికి గాంధీ అర్హత సాధించారు. కానీ న్యాయ పట్టా పొందలేదు. ఆయనకు డిగ్రీ లేదు’’ అని అన్నారు.

గాడ్సేకి నోబెల్ ప్రైజ్ అడుగుతారేమో.. కేటీఆర్ సెటైర్లు!
X

చరిత్రనే మార్చి తమ స్వంత కథనాలను ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు వందల ఏళ్ళ కిందటి చరిత్రను వక్రీకరిస్తే ఎవరికీ పెద్దగా తెలియదనుకోవచ్చు కానీ 75 ఏళ్ళ క్రితం ఉన్న మనిషి పై కూడా అసత్యాలు ప్రచారం చేయడం నిజంగా ధైర్యమే. అయితే ఆ పని చేసింది ప్రత్యక్షంగా బీజేపీలో ఉన్న నాయకుడు కాదు. కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్.

తాజాగా జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘గాంధీజీకి లా డిగ్రీ ఉందనే అపోహ ఉంది. ఆయనకు ఒక్క డిగ్రీ కూడా లేదని మీకు తెలుసా? ఆయన ఏకైక అర్హత హైస్కూల్ డిప్లొమా. లా ప్రాక్టీస్ చేయడానికి గాంధీ అర్హత సాధించారు. కానీ న్యాయ పట్టా పొందలేదు. ఆయనకు డిగ్రీ లేదు’’ అని అన్నారు.

కాగా బీజేపీ నాయకులు చేసే అబద్దపు విన్యాసాలను ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ లో చీల్చి చెండాడే తెలంగాణ మంత్రి కేటీఆర్ మనోజ్ సిన్హా వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు.

మనోజ్ సిన్హా మాట్లాడుతున్న వీడియోను TSREDCO చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ట్వీట్టర్ లో షేర్ చేస్తూ “మహాత్మా గాంధీకి డిగ్రీ లేదని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు. గాంధీజీ ఒక బారిస్టర్ కామెంట్ చేశారు.

దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘తర్వాత వాళ్లు గాడ్సేకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రచారాన్ని ప్రారంభించినా నేను ఆశ్చర్యపోను. వాట్సాప్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు మరి’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు.

మరో వైపు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజనులు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు వ్యగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  24 March 2023 5:46 PM IST
Next Story