Telugu Global
Telangana

రేవంత్ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం.. అవమానమే - కేటీఆర్

తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

రేవంత్ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం.. అవమానమే - కేటీఆర్
X

సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన రేవంత్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోనియా గాంధీని దయ్యం, పిశాచి, బలి దేవత అన్న నువ్వా రాజీవ్‌ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది అంటూ రేవంత్‌కు ప్రశ్నలు సంధించారు కేటీఆర్.

దొడ్డిదారిన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలు రంగు అందరికీ తెలుసంటూ రేవంత్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు కేటీఆర్. ఆలోచనల్లో కుసంస్కారం, నీ మాటలు అష్టవికారం అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేంటని అడిగితే, కారు కూతలు కూస్తావా అంటూ రేవంత్‌ను నిలదీశారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.


గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటుందో తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ రెడ్డి పెడితే అలానే ఉంటుందన్నారు కేటీఆర్. అధికారంలోకి రాగానే తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తామని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం రాసిపెట్టుకోవాలంటూ ట్వీట్ చేశారు.

First Published:  28 Aug 2024 4:52 PM IST
Next Story