Telugu Global
Telangana

కాంగ్రెస్‌కు శిక్ష తప్పదు.. కేటీఆర్‌ ట్వీట్‌

విచారణ జరుగుతుండగానే జస్టిస్‌ ఎల్‌.నరసింహా రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టడాన్ని కేసీఆర్ తప్పు పట్టారు. విచారణ విషయాలను ప్రెస్‌మీట్‌ పెట్టి వివరించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌కు శిక్ష తప్పదు.. కేటీఆర్‌ ట్వీట్‌
X

విద్యుత్‌ కమిషన్‌ ఛైర్మన్‌ను తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. రాజకీయ పగ, దురుద్దేశంతో ఒకరిని నేరస్తుడిగా చూపించే కుట్రలు ఎక్కువ కాలం నిలబడలేవన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఈ కేసులో అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందన్న కేటీఆర్.. త్వరలో ప్రజా కోర్టు సైతం ఇలాంటి తీర్పే ఇస్తుందని స్పష్టం చేశారు. దురుద్దేశంతో చేస్తున్న ప్రచారానికి కాంగ్రెస్‌కు త్వరలోనే శిక్ష పడడం ఖాయమన్నారు. ఎప్పటికైనా సత్యానిదే విజయమంటూ ట్వీట్ చేశారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ రేవంత్ సర్కార్‌ విచారణ కోసం కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌కు జస్టిస్ ఎల్‌.నరసింహా రెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. అయితే విచారణ జరుగుతుండగానే జస్టిస్‌ ఎల్‌.నరసింహా రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టడాన్ని కేసీఆర్ తప్పు పట్టారు. విచారణ విషయాలను ప్రెస్‌మీట్‌ పెట్టి వివరించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. గతంలోనే ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలంటూ జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డికి స్వయంగా లేఖ కూడా రాశారు.

కేసీఆర్ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం.. విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డిని తొలగించి కొత్త వారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జస్టిస్ ఎల్‌.నరసింహా రెడ్డి ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. సోమవారం నాటికి కొత్త ఛైర్మన్‌ను నియమిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.

First Published:  17 July 2024 11:24 AM IST
Next Story