యూటీగా హైదరాబాద్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీతో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి స్నేహం లేదన్నారు కేటీఆర్. స్నేహం ఉండుంటే కవిత జైల్లో ఉండేదా అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గత ఐదేళ్లలో కరీంనగర్‌కు చేసింది శూన్యం అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని చొప్పదండిలో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్.. ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా ప్రచారం చేశారు.
జూన్-2 తర్వాత హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం (UT) చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఆ నిర్ణయాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్, బీజేపీ సన్నాసులకు చేతకాదన్నారు కేటీఆర్. కానీ ఆ నిర్ణయంపై కొట్లాడే ఏకైక జెండా గులాబీ జెండా మాత్రమేనన్నారు కేటీఆర్. మోడీ, రేవంత్ రెడ్డి ఒక్కటేనన్నారు. జూన్ - 4 తర్వాత రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పాలంటే పార్లమెంట్‌లో గులాబీ జెండా ఉండాలన్నారు.
బీజేపీతో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి స్నేహం లేదన్నారు కేటీఆర్. స్నేహం ఉండుంటే కవిత జైల్లో ఉండేదా అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గత ఐదేళ్లలో కరీంనగర్‌కు చేసింది శూన్యం అన్నారు కేటీఆర్. ఆయనకు జై శ్రీరామ్ అనడం తప్ప మరొకటి తెలియదన్నారు.