మోదీ జీ.. ఈ హామీలకు మీ గ్యారెంటీ లేదా - కేటీఆర్
2014 ఎన్నికల టైంలో మోదీ చేసిన వాగ్ధానాలను తన ట్వీట్‌లో గుర్తు చేశారు కేటీఆర్.
BY Telugu Global11 May 2024 4:32 PM IST
X
Telugu Global Updated On: 11 May 2024 4:32 PM IST
కేంద్రంలోని మోదీ సర్కార్‌పై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2014 ఎన్నికల టైంలో మోదీ చేసిన వాగ్ధానాలను తన ట్వీట్‌లో గుర్తు చేశారు కేటీఆర్. 2014లో ఇచ్చిన హామీలకు మోదీ గ్యారెంటీ లేదా అని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా 2014లో బీజేపీ ఇచ్చిన హామీలను కేటీఆర్ గుర్తు చేశారు. ఆ హామీలు ఇవే -
- 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
- ఏటా యువతకు 2 కోట్ల ఉద్యోగాలు
- 2022 నాటికి ప్రతి పేదవాడికి ఇల్లు
- 2022 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియా
- 2022 నాటికి ఇండియాలో బుల్లెట్ రైళ్లు
- నల్ల ధనం వెనక్కి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు
ఈ గ్యారెంటీలకు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. నేషన్ వాంట్స్ టు నో మోదీ జీ అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు.
Next Story