Telugu Global
Telangana

కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

దేశంలో టాప్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్స్‌లో ఒకటైన ఐఐటీ మద్రాస్‌ కేటీఆర్‌ను ఇన్వైట్ చేసింది. శనివారం, ఆదివారం జరిగే సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను కోరింది.

కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం
X

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ టాలెంట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మంచి రాజకీయ నాయకుడే కాదు.. గొప్ప వక్త కూడా. రాజకీయపరమైన అంశాలతో పాటు ఇతర అంశాలపైనా కేటీఆర్‌కు లోతైన అవగాహన ఉంది. తెలంగాణ ఐటీ పురోగతిలో కేటీఆర్ పాత్రను ఎవరూ కాదనలేరు. యూత్‌లో కేటీఆర్‌కు ఉండే క్రేజ్‌ వేరు. అందుకే ఆయనకు నేషనల్‌, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్స్‌ ఇన్విటేషన్స్‌ పంపుతుంటాయి. తాజాగా కేటీఆర్‌కు అలాంటి ఆహ్వానమే అందింది.

దేశంలో టాప్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్స్‌లో ఒకటైన ఐఐటీ మద్రాస్‌ కేటీఆర్‌ను ఇన్వైట్ చేసింది. శనివారం, ఆదివారం జరిగే సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను కోరింది. ఐఐటీ మద్రాస్ ఏటా నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ ఈ- సమ్మిట్‌కు హాజరవ్వాలని కేటీఆర్‌ను కోరింది. ఈ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, వివిధ సంస్థల అధిపతులు, పాలసీ మేకర్లు హాజరవుతుంటారు.

ఈసారి నిర్వహించే సమ్మిట్‌లో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాల కృష్ణన్‌, HCL కో-ఫౌండర్ అజయ్‌ చౌదరి లాంటి ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు. దేశంలోనే ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగిన ఏకైక కార్యక్రమంగా ఈ సమ్మిట్‌ నిలిచింది.

First Published:  8 March 2024 7:33 PM IST
Next Story