రేవంత్ బూతులు.. ఈసీకి ప్రవచనాలా..?
కేసీఆర్ పోరుబాట యాత్రతో బీజేపీ, కాంగ్రెస్ వణికి పోతున్నాయని, అందుకే ఆ రెండు పార్టీలు కలసి ఆయనపై కుట్ర చేశాయని అన్నారు కేటీఆర్.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంపై 48 గంటలు నిషేధం విధిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదెక్కడి అరాచకం...? అంటూ ట్వీట్ వేశారు. అదే సమయంలో మోదీ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎన్నికల కమిషన్ ఏమని సమాధానం చెబుతుందని నిలదీశారు. వారిద్దరి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోని ఈసీ, కేవలం కేసీఆర్ పై చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు కేటీఆర్.
ఇదెక్కడి అరాచకం...?
— KTR (@KTRBRS) May 1, 2024
ఏకంగా Telangana ki Awaaz KCR గొంతు పైనే నిషేధమా..?
మోడీ విద్వేష వ్యాఖ్యలు
ఈసీకి వినిపించలేదా..? Zero action against Modi despite thousands of citizens’ complaints
రేవంత్ బూతులు EC కి
ప్రవచనాల్లాగా అనిపించాయా...? No action against the foul mouthed Cheap…
తెలంగాణ ఆవాజ్.. కేసీఆర్ గొంతుపైనే నిషేధమా..? అంటూ ట్వీట్ వేశారు కేటీఆర్. ప్రధాని మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా అని అన్నారాయన. వేలాదిమంది ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే.. మోదీ విద్వేషాలపై ఈసీ చర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్నారు. ఇక రేవంత్ రెడ్డి పచ్చి బూతులు మాట్లాడుతున్నారని, ఆయన మాటలపై చర్యలు లేవా అని ప్రశ్నించారు. రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా అన్నారు. రేవంత్ చీప్ మినిస్టర్ అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.
కేసీఆర్ పై కుట్ర..
కేసీఆర్ పోరుబాట యాత్రతో బీజేపీ, కాంగ్రెస్ వణికి పోతున్నాయని, అందుకే ఆ రెండు పార్టీలు కలసి ఆయనపై కుట్ర చేశాయని అంటున్నారు కేటీఆర్. బడే భాయ్.. ఛోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది...! అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతారని అన్నారు కేటీఆర్.