Telugu Global
Telangana

సింగరేణికి గనులను ఎందుకివ్వరో కేంద్రాన్ని అడగాలి మమ్మల్ని కాదు -ఈటెలకు కేటీఆర్ పంచ్

''ఈటలకు తాను ఏ పార్టీలో ఉన్నారో గుర్తుందా? ఆయన బీజేపీలో ఉన్నారు. గనులు కేటాయించేది. కేంద్ర బీజేపీ ప్రభుత్వమే. సింగరేణికి ఇవ్వమని ఎన్ని సార్లు ముఖ్యమంత్రి లేఖలు రాసినా ఇవ్వడం లేదు. ఆ నాలుగు బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వాలని వాళ్ళ ప్రభుత్వం మీద ఈటెల వత్తిడి తేవాలి'' అని కేటీఆర్ అన్నారు.

సింగరేణికి గనులను ఎందుకివ్వరో కేంద్రాన్ని అడగాలి మమ్మల్ని కాదు -ఈటెలకు కేటీఆర్ పంచ్
X

సింగరేణికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నాలుగైదు మైన్స్‌ ప్రైవేటు వ్యక్తులకివ్వకుండా సింగరేణితోనే మైనింగ్‌ చేయించాలి అని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడిన మాటల‌పై మంత్రి కేటీఆర్ చురకలంటించారు.

''ఈటలకు తాను ఏ పార్టీలో ఉన్నారో గుర్తుందా? ఆయన బీజేపీలో ఉన్నారు. గనులు కేటాయించేది. కేంద్ర బీజేపీ ప్రభుత్వమే. సింగరేణికి ఇవ్వమని ఎన్ని సార్లు ముఖ్యమంత్రి లేఖలు రాసినా ఇవ్వడం లేదు. ఈటెల రాజేందర్ మాట్లాడేటప్పుడు తాను ఏం మాట్లాడుతున్నానో ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది వాళ్ళ పార్టీ. ఆ నాలుగు బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వాలని వాళ్ళ ప్రభుత్వం మీద ఈటెల వత్తిడి తేవాలి'' అని కేటీఆర్ అన్నారు.

''కేంద్రం దేశీయ బొగ్గు కొనవద్దని, అధిక రేటైనప్పటికీ అదానీకి చెందిన బొగ్గే కొనాలని రాష్ట్రాలపై వత్తిడి చేసింది. ఇదంతా ఎవరి ప్రయోజనాల కోసం మోడీ చేశారు?ప్రధాని ఆస్ట్రేలియాకు పోగానే అదానీకి పెద్ద బొగ్గు గని రెండునెలల్లోనే వస్తుంది. ఇండోనేషియాకు ప్రధాని పోగానే.. నెల రోజుల్లోనే మళ్లీ అక్కడ అదానీకి బొగ్గు గనులు వస్తాయి. ఇవాళ దేశంలో ఏం జరుగుతుందో వారి మనసుకు కూడా తెలుసు. బొగ్గు గనుల కోసం ఈటెల ఆవేదన చెబుతున్నారు. నిజంగానే అంత ఆవేదన ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించండి.'' అని కేటీఆర్ అన్నారు.

గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు మాత్రం నామినేషన్‌ బేసిస్ మీద గనులు ఇస్తారు. తెలంగాణకు ఎందుకివ్వరు? అని కేటీఆర్ ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మడాన్ని కూడా కేటీఆర్ ప్రశ్నించారు. విశాఖ ఉక్కుకు గనులివ్వకుండా , ఓ కుక్కను చంపేముందు పిచ్చికుక్క అని ముద్రేసినట్లు విశాఖ స్టీల్ నష్టాల్లో ఉందని ఓ బోర్డు తగిలించారని కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి విషయంలో కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నదని కేటీఆర్ అన్నారు. గనులను గుజరాత్‌కు ఎందుకు ఇస్తున్నారు? తెలంగాణకు ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని అడగండి. అలాగే విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నరో అడగండి.. గనులు ఎందుకివ్వకుండా నిర్వీర్యం చేశారని అడగండి.మాటల్లో ప్రేమకురిపిస్తూ. చేతల్లో ఇంకోలా చేస్తే మీ పార్టీని, మీ నాయకత్వాని తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించరు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

First Published:  10 Feb 2023 6:13 PM IST
Next Story