చార్మినార్ దగ్గర కేటీఆర్ ధర్నా.. ఎందుకంటే?
ఓ వైపు రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించనున్న జయ జయహే తెలంగాణ గీతంలో చార్మినార్ గొప్పతనం, కాకతీయ తోరణం కళా వైభవం కీర్తిస్తూ మరోవైపు లోగో నుంచి ఆ రెండు చిహ్నాలను తొలగించడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లోగో నుంచి నుంచి చారిత్రక చిహ్నాలైన చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కాకతీయ కళాతోరణం తొలగింపుపై బుధవారం వరంగల్ కోటలో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. చార్మినార్ తొలగింపుపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్..ఇవాళ చార్మినార్ దగ్గర ధర్నా చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు.
మరోవైపు ఇదే అంశంపై ట్వీట్ చేశారు కేటీఆర్. హైదరాబాద్కు చార్మినార్ చిహ్నంగా ఉందన్న కేటీఆర్..హైదరాబాద్ గురించి గుర్తు చేసుకుంటే యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన చార్మినార్ను తలుచుకోక తప్పదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలతో ఐకానిక్ చార్మినార్ను రాష్ట్ర లోగో నుంచి తొలగించాలనుకుంటోందన్నారు. ఇది సిగ్గుచేటంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఓ వైపు రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించనున్న జయ జయహే తెలంగాణ గీతంలో చార్మినార్ గొప్పతనం, కాకతీయ తోరణం కళా వైభవం కీర్తిస్తూ మరోవైపు లోగో నుంచి ఆ రెండు చిహ్నాలను తొలగించడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
World over, Charminar has been the icon/symbol of Hyderabad for centuries
— KTR (@KTRBRS) May 30, 2024
When one thinks of Hyderabad, they cannot but think of Charminar which has all the qualities of a UNESCO world heritage site
Now Congress Government wants to remove the iconic Charminar from the state… pic.twitter.com/SQVxQAI6lL
మరోవైపు బుధవారం వరంగల్ కోటలో నిరసన తెలియజేసిన బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. అనుమతి లేకుండా కోటలోకి చొచ్చుకెళ్లారంటూ బోయినపల్లి వినోద్ కుమార్, నన్నపనేని నరేందర్, వినయ్ భాస్కర్, బస్వరాజు సారయ్య సహా ఏడుగురిపై కేసు నమోదైంది.