Telugu Global
Telangana

రైతు ఆవేదన.. నేనొస్తానంటూ కేటీఆర్ హామీ!

కేసీఆర్ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉన్నామని.. సరైన స‌మయానికి రైతుబంధు, సాగునీరు రావడంతో ఇబ్బందులు లేకుండా బతికామన్నారు మల్లయ్య. కానీ, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయన్నారు.

రైతు ఆవేదన.. నేనొస్తానంటూ కేటీఆర్ హామీ!
X

తెలంగాణలో ప్రస్తుతం కరువు పరిస్థితులు ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సాగు నీరు అందక చేతికొచ్చిన పంటపొలాలు ఎండిపోయాయి. మిగిలిన వాటిని కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన మల్లయ్య అనే రైతు వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


కేసీఆర్ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉన్నామని.. సరైన స‌మయానికి రైతుబంధు, సాగునీరు రావడంతో ఇబ్బందులు లేకుండా బతికామన్నారు మల్లయ్య. కానీ, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయన్నారు. రైతుబంధు అందక అప్పులయ్యాయని, పొలం, తోట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మల్లయ్య. తన కొడుకు ఇప్పటికే చనిపోయాడని, తానొక్కడినే కష్టపడుతున్నానంటూ తన బాధను చెప్పుకున్నారు. తనకు ఇప్పటికే వయసు మీద పడిందని, బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు మల్లయ్య.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ వీడియో తన హృదయాన్ని తాకిందని ట్వీట్ చేశారు. త్వరలోనే వ్యక్తిగతంగా ముషంపల్లికి వచ్చి బోర్ల రాంరెడ్డితో పాటు మల్లయ్యను కలుస్తానంటూ హామీ ఇచ్చారు.

First Published:  12 March 2024 11:05 AM IST
Next Story