కవిత డిమాండ్ ని గుర్తు చేసిన కేటీఆర్
జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో తెలంగాణలో అనేక గొప్ప పథకాలను కేసీఆర్ ప్రారంభించారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ గురించి తాము మాట్లాడినప్పుడల్లా.. డెవలప్డ్ స్కిల్ గురించి కూడా ఆలోచించాలని కేసీఆర్ తమకు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణలో మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత చేసిన డిమాండ్ ని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫూలే 197వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికోసం ఫూలే చేసిన కృషిని కొనియాడారు.
Live: మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు
— BRS Party (@BRSparty) April 11, 2024
తెలంగాణ భవన్ https://t.co/8IVJV4iyCB
కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తయిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం జ్యోతిరావు ఫూలే సమున్నత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ప్రస్తుతం ఆయన 197వ జయంతిని జరుపుకుంటున్నామని, ఫూలే 200 జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ జరిగే బాగుంటుందని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేస్తే.. దేశానికి సేవ చేసిని ఇద్దరు గొప్ప సంఘ సంస్కర్తల భారీ విగ్రహాలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు కేటీఆర్.
ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు వస్తుంటారు పోతుంటారు.. కానీ సంఘ సంస్కర్తలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు కేటీఆర్. జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో తెలంగాణలో అనేక గొప్ప పథకాలను కేసీఆర్ ప్రారంభించారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ గురించి తాము మాట్లాడినప్పుడల్లా.. డెవలప్డ్ స్కిల్ గురించి కూడా ఆలోచించాలని కేసీఆర్ తమకు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. అందుకే బీసీ వర్గాలకోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అంటూ ఎన్నికల ముందు హడావిడి చేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ హామీలను మరచిపోయిందని విమర్శించారు కేటీఆర్. బీసీ సబ్ ప్లాన్ కూడా అమలు చేయాలన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తాము ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నామని, వారు సహృదయంతో స్వీకరించాలన్నారు కేటీఆర్.