మార్చి 31లోగా ప్రతి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని కేటీఆర్ ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా 129 మునిసిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లలో 144 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని డిపార్ట్‌మెంట్ ప్లాన్ చేసింది. వీటిలో 10 పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో 128 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లనిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
మార్చి 31లోగా ప్రతి పట్టణంలో కనీసం ఒక ఇంటిగ్రేటెడ్ కూరగాయలు, మాంసం మార్కెట్‌ను నిర్మించాలని పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 129 మునిసిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లలో 144 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని డిపార్ట్‌మెంట్ ప్లాన్ చేసింది. వీటిలో 10 పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో 128 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లనిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
ఈ నెల ప్రారంభంలో జరిగిన పట్టణ ప్రగతి వర్క్‌షాప్‌లో, ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రతి పట్టణంలో కనీసం ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు (యుఎల్‌బి) సైట్‌లను సందర్శించాలని, ఏవైనా సమస్యలు ఉంటే, సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కలెక్టర్ల ముందు సమస్యను తీసుకరావాలని ఆదేశించారు.
శాఖల మధ్య సమన్వయ లోపం, కాంట్రాక్టు బిల్లుల క్లియరింగ్‌లో జాప్యం వంటి వివిధ కారణాల వల్ల చాలా చోట్ల పనులు మందకొడిగా సాగుతున్నాయి. దాంతో కేటీఆర్ మరో సారి కలగజేసుకొని అధికారులకు ఆదేశాలిచ్చారు. మార్చి 31లోగా ప్రతి పట్టణంలో ఒక మార్కెట్ పూర్తయి తీరాలని ఆయన స్పష్టం చేశారు.
స్థలాన్ని బట్టి ఒక్కో మార్కెట్‌ను సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ప్రతి మార్కెట్‌లో కనిష్టంగా 50 స్టాళ్ల నుండి గరిష్టంగా 150 స్టాళ్ల వరకు ఉంటాయి. ఒక్కో మార్కెట్ ను దాదాపు రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్లతో నిర్మిస్తున్నారు.
వినియోగదారులకు చేపలు, చికెన్, మటన్, తాజా కూరగాయలు, పండ్లు, పువ్వులు అన్నీ ఒకే దగ్గర లభించే విధంగా వీటి నిర్మాణం సాగుతోంది. ఈ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు కేటాయించగా, చాలా చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల వివరాలు
– లక్ష్యం: 144
- పూర్తయింది: 10
– సైట్ క్లియరెన్స్ : 61
పనుల పురోగతి
– ప్లింత్ లెవల్ : 33
- పైకప్పు స్థాయి: 22
– నిర్మాణాలు ముగింపు స్థాయి: 13
– ప్రోగ్రెస్‌లో ఉన్న మొత్తం: 128