ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలి..
తెలంగాణలో ప్రతి కుటుంబం బీఆర్ఎస్ హయాంలో ఏదో ఒక సంక్షేమ పథకంతో లాభపడిందని, అదే సమయంలో మోదీ తరపున వారికి ఏం జరిగిందనేది మాత్రం బీజేపీ నాయకులు చెప్పలేరని అన్నారు కేటీఆర్.
మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ కు బీజేపీతోనే పోటీ అని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ కి ఓటు వేస్తే అది బీజేపీకే లాభం అని చెప్పారు. జై శ్రీరామ్ నినాదం కడుపు నింపదని, ఆ నినాదం ఉద్యోగం ఇవ్వదని అన్నారు. ఇప్పుడు యువతకు కావాల్సింది ఉద్వేగాలు కాదని, ఉద్యోగాలని వివరించారు. తెలంగాణలో నిజమైన సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు కేటీఆర్. మనిషిని మనిషిగా చూసే నాయకుడు, మనిషిలో మతం కోణం చూడని నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. జై శ్రీరామ్ అంటూ ఉద్వేగాలు పెంచి పోషించే నాయకులు అవసరం లేదని, యువత తరపున వారి ఉద్యోగాల కోసం పార్లమెంట్‌లో కొట్లాడేవాళ్లు కావాలని, వారికే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
అదానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్లకు
— BRS Party (@BRSparty) April 2, 2024
14.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన బీజేపీ
రైతు రుణ మాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడాలె!
రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఫైర్ pic.twitter.com/tQbHHyF5ck
తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని చెప్పారు కేటీఆర్. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం గుండు సున్నా చుట్టిందని, కనీసం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని, కొత్తగా ఒక్క విద్యాసంస్థ ఇవ్వకుండా ప్రధాని కాలయాపన చేశారని అన్నారు. యాదాద్రిని అద్భుతంగా అభివృద్ధి చేసినా, తాము ఏనాడూ మతం పేరు చెప్పుకోలేదని, కేసీఆర్ నిజమైన హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారని చెప్పారు కేటీఆర్.
తెలంగాణలో ప్రతి కుటుంబం బీఆర్ఎస్ హయాంలో ఏదో ఒక సంక్షేమ పథకంతో లాభపడిందని, అదే సమయంలో మోదీ తరపున వారికి ఏం జరిగిందనేది మాత్రం బీజేపీ నాయకులు చెప్పలేరని అన్నారు కేటీఆర్. ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు దమ్ముంటే, బీజేపీకి సత్తా ఉంటే.. మోదీ ప్రభుత్వం మల్కాజ్‌గిరి పార్లమెంట్‌కు ఏం చేసిందో చెప్పి ఓటు అడగాలని సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు ఈటల రాజేందర్‌కు సిగ్గు అనిపించాలన్నారు కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వంలో ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మొదటి టర్మ్‌లో రూ. 16 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. కానీ మోదీ హయాంలో రైతులకు మేలు జరగలేదని, మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో రూ. 14 లక్షల కోట్లు పెద్ద వ్యాపారులకు రుణమాఫీ చేసిందని అన్నారు. వ్యాపారులకు మేలు చేసిన మోదీ రైతులకు ఏం చేశారని నిలదీశారు కేటీఆర్.