Telugu Global
Telangana

మానుకోట మహా ధర్నాకు చేరుకున్న కేటీఆర్

మహబూబాబాద్ గిరిజన మహాధర్నాలో మహాధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు మార్గంలో మహబూబాబాద్ బయలుదేరారు.

మానుకోట మహా ధర్నాకు  చేరుకున్న కేటీఆర్
X

మానుకోట గిరిజన మహాధర్నాలో మహాధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు మార్గంలో మహబూబాబాద్ బయలుదేరారు. దీంతో కేటీఆర్‌కు చిట్యాల వద్ద ఘనస్వాగతం లభించింది. ఆయనకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, నకేరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇతర మాజీ ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ఆయన కారు విండో వద్ద స్టాండింగ్‌‌లో ఉండి కేడర్‌కు కరచాలనం చేశారు. కొడంగల్‌లోని లగచర్లలో గిరిజన రైతులపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధర్నా ద్వారా గిరిజనులకు భరోసా కల్పించి వారికి దగ్గర అయ్యేందుకు బీఆర్ఎస్ యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉదయం 10:30 గంటలకు మహబూబాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద్ద జరగనున్న బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ పాల్గొంటారు. ముందుగా ఈ నెల 21న మహాధర్నా నిర్వహించాలని పార్టీ తలపెట్టినా, కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి అనుమతి నిరాకరించేలా చేసింది.

దీంతో జిల్లా నేతలు హైకోర్టును ఆశ్రయించి ఈనెల 25న మహా ధర్నా నిర్వహించేందుకు అనుమతి పొందారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరుకానుండటంతో బీఆర్‌ఎస్‌ నాయకులు మానుకోటలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో కేటీఆర్ హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో మహబూబాబాద్‌కు బయలుదేరనున్నారు. మహా ధర్నా జరగనున్న నేపథ్యంలో ఫ్లెక్సీల రగడ జరుగుతోంది. కేటీఆర్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపిన వేశారు.

First Published:  25 Nov 2024 11:11 AM IST
Next Story