Telugu Global
Telangana

ఖర్గే జీ.. రేవంత్‌కు మీరైనా చెప్పండి - కేటీఆర్

మహబూబ్‌నగర్‌లో దాదాపు 75 మంది పేద కుటుంబాల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్.

ఖర్గే జీ.. రేవంత్‌కు మీరైనా చెప్పండి - కేటీఆర్
X

మహబూబ్‌నగర్‌లోని ఆదర్శ్‌నగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇళ్ల కూల్చివేతలపై గతంలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే చేసిన ఓ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ఆయనకు ఓ విజ్ఞప్తి చేశారు కేటీఆర్.

కేటీఆర్ ట్వీట్ -

ఖర్గే జీ, మీరు గతంలో చెప్పినట్లుగా ఒకరి ఇంటిని కూల్చివేసి, వారిని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం. తెలంగాణలోనూ చట్టాలను, న్యాయవ్యవస్థలను ధిక్క‌రించే చ‌ర్య జ‌రుగుతోంది. మహబూబ్‌నగర్‌లో దాదాపు 75 మంది పేద కుటుంబాల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్. కూల్చివేతలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌లో పంచుకున్నారు కేటీఆర్. బాధితుల్లోని 25 కుటుంబాల్లో శారీరక వికలాంగులు కూడా ఉన్నారని చెప్పారు. ఎలాంటి విధి, విధానాలు లేని చట్టం చట్టమే కాదన్న కేటీఆర్.. దయచేసి దేశంలో మరో బుల్డోజర్‌ స్టేట్‌గా తెలంగాణ మారకుండా రేవంత్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని ఖర్గేను కోరారు కేటీఆర్.


గతంలో ఖర్గే ఏమన్నారంటే -

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ చర్యలను వ్యతిరేకిస్తూ గతంలో ట్వీట్ చేశారు ఖర్గే. ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని రోడ్డున పడేయం అమానవీయం, అన్యాయమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలపై పదే పదే దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు ఖర్గే. రూల్‌ ఆఫ్‌ లా ద్వారా నడిచే సమాజంలో ఇలాంటి చర్యలకు స్థానం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని గౌరవించకపోవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందంటూ ట్వీట్ చేశారు ఖర్గే. నేరం జరిగితే కోర్టులో న్యాయం జరగాలని, ఇలా ప్రభుత్వం బలవంతంగా చేసే చర్యల ద్వారా కాదన్నారు ఖర్గే.

గురువారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్‌లోని ఆదర్శనగర్‌లో 75 పేదల ఇండ్లను అధికారులు కూల్చివేశారు. ఐతే బాధితుల్లో ఎక్కువ మంది అంధులు, దివ్యాంగులు ఉండడంతో చర్చనీయాంశమైంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కూల్చేయడంతో వందలాది మంది పేదలు రోడ్డున పడ్డారు.

First Published:  30 Aug 2024 3:47 PM IST
Next Story