సుఖేష్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు
తనపై చేసిన ఫిర్యాదులను సుఖేష్ బేషరతుగా వెనక్కు తీసుకోవడంతోపాటు తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఆ నోటీసుల్లో మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆర్థిక నేరగాడు సుఖేష్ కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బేషరతుగా తనపై చేసిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలన్నారు. భవిష్యత్ లో తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
తీహార్ జైలులో ఉన్న సుఖేష్ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రానికి, సీబీఐకి ఫిర్యాదు చేస్తూ సుఖేష్ ఓ లేఖ రాసినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. తెలంగాణ గవర్నర్ కి కూడా సుఖేష్ లేఖ రాశారంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సుఖేష్ ఎవరో తనకు తెలియదని, మీడియా కూడా ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాజాగా మంత్రి సుఖేష్ కి లీగల్ నోటీసులు పంపించారు.
సుఖేష్ లేఖ రాశారని మీడియాలో వార్తలు రావడంతో కలకలం రేగింది. అసలు సుఖేష్ అనే వ్యక్తితో తమకు సంబంధం లేదని, ఆ రోగ్ తనకు తెలియదని అన్నారు మంత్రి కేటీఆర్. భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం జరగకుండా ఆయన లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన ఫిర్యాదులను సుఖేష్ బేషరతుగా వెనక్కు తీసుకోవడంతోపాటు తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు.